వెంకీ మామ : అంత మామ గురించేనా ? అల్లుడి గురించి ఎం లేదా ?
సంక్రాంతికి వస్తాడు అనుకున్న వెంకీ మామ ముందుగానే వచ్చేశాడు. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, ఫైట్స్ అబ్బా అబ్బా అన్ని రుచులు కలిసిన సినిమా ఇది. ఎంతో అద్భుతంగా తీశారు సినిమాను. మామగా విక్టరీ వెంకటేష్ అదరగొట్టగా అల్లుడిగా నాగ చైతన్య ఈ సినిమాలో అదరగొడుతున్నాడు. ఇంకా వెంకీ మామ పక్కన పాయల్ రాజపుత్, అల్లుడు నాగచైతన్య పక్కన రాశి ఖన్నా కథానాయకలాగా నటించారు.
అయితే సినిమా అంత యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని కలిసిన సినిమా. ఈ సినిమా మొత్తంలో వెంకీ పాత్రే ఎక్కువ ఉందని.. అల్లుడి గారి పాత్ర చాల చిన్నది అని అభిమానులు అంటున్నారు. అసలు మామ అల్లుడ్ల ప్రేమలో మామను ఎక్కువ చూపించారు. అల్లుడిని తక్కువ చూపించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..
కాగా ఈ వెంకీ మామ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉందని, అయితే దర్శకుడు బాబీ ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతంగా తీసినప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం కేర్ తీసుకోలేదని అంటున్నారు. అయితే ఓవర్ ఆల్ గా సినిమా అంత చూస్తే బాగానే ఉందని, చాలా ఏళ్ళ తరువాత వెంకటేష్ ని మంచి రోల్ లో చూశామని కొందరు ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో నెలలకు మల్టీస్టార్ చిత్రాలు విడుదల అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు ఈ వెంకీ మామ..