తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ వెర్షన్లు కలిపి 250కోట్ల వసూళ్లను సాధించి సౌత్ లో ఈఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం తెలుగు లో విజిల్ గా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కూడా అదరగొట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ 12కోట్ల షేర్ ను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఈ చిత్రం తో విజయ్ కి తెలుగులో మార్కెట్ మరింతగా పెరిగింది. ఇంతకుముందు విజయ్ నటించిన సర్కార్ కూడా 7కోట్ల షేర్ తో సూపర్ హిట్ అనిపించుకోగా తాజాగా విజిల్ తెలుగులో విజయ్ కి వరసగా రెండో విజయాన్ని అందించింది.
ఇక ఈ సినిమా తమిళ , తెలుగు వెర్షన్ లు ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైయ్యాయి. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ వున్న వారు ఈ చిత్రాన్ని చూసేయచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై కల్పాతి ఎస్ అగోరం నిర్మించాడు. ఇక అట్లీ - విజయ్ లకు బిగిల్ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి , మెర్సల్ సూపర్ హిట్లు అవ్వగా తాజాగా బిగిల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం విజయ్ ఖైదీ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్ లో తన 64 వచిత్రంలో నటిస్తున్నాడు. గత కొద్దీ రోజులనుండి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.