రజినీకాంత్ పోస్టర్ గొడవ

Narayana Molleti
ఫ్యాన్స్ అభిమానానికి హీరోలు హ్యాపీగా ఫీలవుతారు.. అదేవిధంగా ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే చిన్న చిన్న తప్పులకు హీరోలు భారి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సేం ఇలానే తమిళనాడులో రజిని అభిమానులు రజిని కాంత్ మీద ఉన్న తమ వల్లమాలిన అభిమానం చాటుకునే ప్రయత్నం లో ఓ పొరపాటు చేసారు. అదేంటంటే రజిని ఓటు వేసే పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు ఆ అభిమానులు. దానిలో రజిని లైన్ లో నిలబడి ఉంటే అదే లైన్ లో హిందు దేవుళ్ళు వినాయకుడు ,విష్ణుమూర్తి ని కూడా ఉంచారు సదరు అభిమానులు. విషయం తెలుసుకున్న హిందూ సంరక్షణ పరిషత్ వారు పెద్ద గొడవ చేసారు. యాక్చువల్ గా ఆ అభిమానుల ఉద్దేశం ఏంటంటే సూపర్ స్టార్ రజిని కాంత్ రాజకీయాల్లోకి వస్తే దేవుళ్ళు సైతం ఓటు వేయడానికి వస్తారని వారి అభిప్రాయం. అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించారు ఆ అభిమానులు. ఇక ఈ విషయం తమిళ నాడు ముఖ్య మంత్రి జయలలిత దాకా వెల్లిందని టాక్ మరి ఆవిడ స్పందన గురించి ఇంకా ఏమీ తెలియలేదు. ఈ విషయమంతా సూపర్ స్టార్ రజిని కూడా తెలిసినట్లు లేదు లేదంటే ఖచ్చితమైన వివరణ ఇచ్చేవాడు మన రోబో. సో మొత్తానికి తన ప్రమేయం లేకపోయిన ఈ ఫ్యాన్స్ వలన ఒకరికి సమాధానం చె ప్పాల్సిన పరిస్థితి వచ్చింది రజిని. అభిమానం ఉండాలి కాని మన అభిమానం ఆ హీరో అపాలజీ చెప్పుకునే విధంగా ఉండకూడదని కొందరి కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: