కేఏ పాల్ ఆ పనిలో బిజీగా ఉన్నారు... వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

praveen

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ కేరాఫ్ వివాదాలే.ఏ  సినిమా తెరకెక్కించిన వివాదం  కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద  సినిమాలతో  పెను సంచలనమే  సృష్టించాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు ని ఘోరంగా టార్గెట్ చేసి చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని ఎలా  లాగేసుకున్నారో  నిజాలు చెబుతానని సంచలనం సృష్టించారు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలనానికి వర్మ తెరలేపిన  విషయం తెలుసిందే . కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో మరో సంచలనం సృష్టించబోతున్నట్లు  క్లారిటీ ఇచ్చారు. 

 కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాని తెర మీదకు తెచ్చి ... పెద్ద దుమారమే రేపారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాలు 2019 ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు... ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పరిణామాలను చూపించబోతున్నాను  తాజాగా మీడియా సమావేశంలో  కూడా తెలిపారు వర్మ . కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ వివాదాల్లో నిలిచింది. ఈ సినిమా ఓ  కులం వాళ్లని కించపరిచేలా ఉందంటూ  ఆరోపణలు రావడం... తాజాగా ఈ సినిమాను నిలిపివేయాలంటూ క్రైస్తవ మత బోధకుడు.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

 ఈ సినిమాలో తన  వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తన పాత్రను  చిత్రీకరించారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్ . అయితే అటు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అని మార్చారు. ఈ సినిమాలో కేఏ పాల్  పాత్ర గురించి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేఏ పాల్ గురుంచి  పట్టించుకోవడం మానేసి ఎంతో కాలమైంది  అంటూ వర్మ అన్నారు. కేఏ పాల్ ప్రపంచ యుద్ధం ఆపే పనిలో బిజీగా వున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. తన సినిమాలో  కె ఏ పాల్ పాత్రను  ఆయన అంత సీరియస్  తీసుకుంటారని తాను భావించడం లేదంటు  వర్మ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా పై నేడు హైకోర్టులో విచారణ జరగుతుండగా  ఇంకాసేపట్లో హైకోర్టులో  తీర్పు వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: