జబర్దస్త్ ను వెంటాడుతున్న నాగబాబు నీడ !

Seetha Sailaja

‘జబర్దస్త్’ షో నుండి నాగబాబు బయటకు వచ్చి ‘జీ’ తెలుగు ఛానల్ కార్యక్రమం సరె.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం..! అన్ని జరుగుతాయా ఏంటి ?’ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ‘జబర్దస్త్’ కు నాగబాబుకు బంధాలు తెగిపోయాయి. వాస్తవానికి నాగబాబు స్థానాన్ని ఆలీతో సద్దుబాటు చేద్దాము అని మల్లె మాల సంస్థ భావించినా కొన్ని కారణాలు వల్ల ఆ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అని టాక్.

దీనితో కొన్ని వారాల పాటు ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని కొంత మంది గెస్ట్ సెలెబ్రెటీస్ సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని మల్లెమాల సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబు స్థానాన్ని భర్తీ చేయగల సెలెబ్రెటీ కోసం ప్రస్తుతం మల్లెమాల సంస్థ అన్వేషణ సాగిస్తున్న పరిస్థితులలో కొంతమంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఆ పేర్లు పట్ల మల్లెమాల సంస్థ నిర్వాహకులు పూర్తిగా సంతృప్తి పడటం లేదు అని తెలుస్తోంది. 

వాస్తవానికి నాగబాబు ‘జబర్దస్త్’ షోలో పెద్దగా నవ్వడం తప్ప మరి ఏపని చేయలేదు అని కొందరు విమర్శలు చేసినా నాగబాబు జబర్దస్త్ షోకు తెర వెనుక చాల కృషి చేసాడు అన్న విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ షోకు సంబంధించి కమెడియన్స్ ను కంట్రోల్ చేయడంతో పాటు టెక్నికల్ టీమ్ ను ఒక త్రాటి పై నడిపించి ఈ షో రికార్డింగ్ లను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలో నాగబాబు వ్యూహాలు చాల ఉన్నాయి అని అంటారు. ఈ షో రికార్డింగ్ ఉదయం ప్రారంభం అయితే అర్దరాత్రి వరకు కనసాగుతూనే ఉంటుంది. 

దీనితో ఈ షో షూటింగ్ సమయంలో టెక్నికల్ టీమ్ అదేవిధంగా కమెడియన్స్ అలిసి పోయినప్పుడు వారిని జోక్స్ వేసి నవ్విస్తూ వారిని తన గ్రిప్ లో పెట్టుకుని షో షూటింగ్ కు ఎటువంటి బ్రేక్ పడకుండా నాగబాబు ప్లాన్ చేసిన తీరు మరొకరికి రాదనీ అన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ షోకు నాగబాబుతో పాటు రోజా జడ్జిగా వ్యవహరించినా ఆమె ఈ షోకు సంబంధించిన వ్యవహారాలను పట్టించుకున్నది చాల తక్కువ అనీ మొత్తం అన్నీ తానై నాగబాబు వ్యవహరించాడు అని కూడ అంటారు. దీనికితోడు నాగబాబు స్థానంలోకి రావడానికి కొంతమంది సెలెబ్రెటీలు ఉత్సాహం చూపుతున్నా మల్లెమాల సంస్థ వారికి ఈ షో నిమిత్తం ఇస్తున్న 7 పేజీల ఎగ్రిమెంట్ ను చూసి భయపడుతున్నారని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: