పవన్ బాడీ లాంగ్వేజ్ అనుసరణలోని చిరంజీవి ఆంతర్యం !
కొంతకాలం చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మధ్య విపరీతమైన గ్యాప్ కొనసాగింది. చిరంజీవి షష్టిపూర్తి వేడుకలకు కూడ పవన్ చివరి నిముషం వరకు వస్తాడా రాడా అన్న టెన్షన్ లోనే మెగా అభిమానులు ఉన్నారు. చివరికి చిరంజీవి 9 సంవత్సరాల గ్యాప్ తరువాత నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ ఫంక్షన్ కు కూడ పవన్ డుమ్మా కొట్టాడు.
అలాంటిది ఇప్పుడు పవన్ చిరంజీవిల మధ్య విపరీతమైన సాన్నిహిత్యం పెరిగి పోవడమే కాకుండా అవకాశం దొరికినప్పుడు చిరంజీవి పవన్ ను పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ఒకరి ఫై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో నిన్న జరిగిన ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ మూవీలోని చెగువీరా పై ఉన్న పాట తాను విన్నప్పుడు తనకు పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ నామస్మరణను కొనసాగించాడు చిరంజీవి.
ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి ఎప్పుడు లేని విధంగా పవన్ బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులను అదేవిధంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్ చిరంజీవిలో చూసిన మెగా అభిమానులు ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయారు.
అయితే చిరంజీవి అనుసరించిన పవన్ బాడీ లాంగ్వేజ్ అనుసరుణ పై ఇప్పుడు కొందరు యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు కూడ వేస్తున్నారు. గెరిల్లా పోరాటంలో చెగువేరా కోసం వేలాది మంది ప్రాణాలర్పించిన నేపధ్యంలో అలాంటి మహోన్నత వ్యక్తికి పవన్ కళ్యాణ్ కు పోలిక ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే అనుకోకుండా పవన్ నిన్న ‘అర్జున్ సురవరం’ ఫంక్షన్ లో పవన్ ప్రస్తావన తీసుకు రావడమే కాకుండా అతడి బాడీ లాంగ్వేజ్ ని అనుసరించడం యాధృశ్చికమే అయినా అనవసరపు సెటైర్లు మధ్య చిరంజీవి ఇరుక్కోవడం ఆశ్చర్యంగా మారింది..