నాగబాబు వెళ్లిపోవడంతో జబర్దస్త్ లో రోజా రాజకీయాలు.?
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంత పాపులారిటీ ఉందొ అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది... ఎంతోమంది కొత్త కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో. అలాంటిది ఈ షోకి ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడింది. జబర్దస్త్ కు వచ్చి చాలా ఫేమస్ అయిన టీం లీడర్ అందరూ జబర్దస్త్ నుంచి విడి పోతుండడంతో జబర్దస్త్ షో పరిస్థితి ఏంటని ప్రస్తుతం ప్రేక్షకులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇక జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జిగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో కి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఇక నాగబాబు నవ్వుల కోసమే ఎంతో మంది జబర్దస్త్ చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అలాంటి మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడం బుల్లితెరపై సంచలనం రేపింది.
జబర్దస్త్ జడ్జ్ నాగబాబు తప్పుకోవడంతో పాటు మిగిలిన ఇంకొంత మంది టీమ్ లీడర్లు కూడా జబర్దస్త్ ను వదిలి వెళ్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే జబర్దస్త్ లో తెగ ఫేమస్ అయిపోయిన చమ్మక్ చంద్ర జీ తెలుగు లో ప్రసారం అయ్యే వేరే షోలో తన కామెడీ మొదలెట్టేశాడు. అంతేకాకుండా ఇంకొంతమంది టీం లీడర్ గా కూడా జబర్దస్త్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టీం లీడర్స్ జబర్దస్త్ నుంచి తప్పుకోగా ... జబర్దస్త్ నుంచి ఇంకా ఎవరెవరు వెళ్ళిపోతున్నారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. జబర్దస్త్ నుండి నాగబాబు తప్పుకున్న తర్వాత రోజా ఒక్కరే జబర్దస్త్ షోలో జడ్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వరకు కొత్త జడ్జ్ గా మాత్రం ఎవరు జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వలేదు.
అంతేకాకుండా జబర్దస్త్ షోని పాపులర్ చేసే బాధ్యతలను కూడా రోజా తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో జబర్దస్త్ షోకు రోజా ప్రస్తుతం పెద్ద దిక్కుగా మారిపోయారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నుంచి నాగబాబు తో పాటు బయటకు వెళ్లాలని భావించే కొందరు టీమ్ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టీమ్ లీడర్లతో చర్చించి వారిని కన్విన్స్ చేసే పనిలో పడ్డారట జబర్దస్త్ జడ్జ్ రోజా . జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లి పోవాలి అనుకున్న వారిని రోజా కన్విన్స్ చేయడంతో...వారూ జబర్దస్త్ లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రకంగా రోజా జబర్దస్త్ షో కి పెద్దదిగా మారి ముందుకు తీసుకెళుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.