రోజా నాగబాబుల మధ్య ఇగో వార్ గా మారిన జబర్దస్త్ రాజకీయాలు !
నాగబాబు ‘జీ’ తెలుగు ఛానల్ నిర్వహిస్తున్న ‘లోకల్ గ్యాంగ్’ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈషోకు మరింత క్రేజ్ తీసుకు రావడానికి ‘జబర్దస్త్’ టాప్ కమెడియన్స్ అందర్నీ నాగబాబు వ్యక్తిగతంగా వారికి ఫోన్స్ చేసి ‘జబర్దస్త్’ ను వదిలి తమ షోలోకి రావలసిందిగా కోరడమే కాకుండా వారికి భారీ పారితోషికాలు ఇప్పిస్తామని వాగ్దానం చేస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈ విషయాలు రోజా దృష్టి వరకు రావడంతో ఆమె వ్యక్తిగతంగా రంగంలోకి దిగి ‘జబర్దస్త్’ షో నుండి ఎవరు వెళ్ళిపోకుండా తనకున్న పరిచయాలతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు రోజా చాల మంది ‘జబర్దస్త్’ కమెడియన్స్ తో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ‘జబర్దస్త్’ షో వల్ల చాలామంది సెలెబ్రెటీలుగా మారడమే కాకుండా అనేక ఆస్తులను కొనుక్కున్న విషయాలను మరిచిపోవద్దని చెపుతూ తమకు లైఫ్ ను ఇచ్చిన షోకు వెన్నుపోటు పొడవవద్దు అంటూ ఆమె సహజసిద్ధమైన శైలిలో క్లాస్ పీకుతున్నట్లు టాక్. దీనితో రోజా మాటలకు ‘జబర్దస్త్’ నుండి జంప్ ఇవ్వాలి అనుకున్న కొంతమందిలో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు నాగబాబు కొత్త షోలోకి చమ్మక్ చంద్ర ఆర్పీలు జంప్ అయినప్పటికీ సుధీర్ అభీలను నాగబాబు షోలోకి వెళ్ళకుండా రోజా అడ్డుకట్ట వేయగలిగింది అని అంటున్నారు. అయితే వీరిద్దరికీ నాగబాబు లిఫ్ట్ ఇచ్చిన నేపధ్యంలో వీరిని కూడ తన షోలోకి తెచ్చుకుని ‘జబర్దస్త్’ షోను ఖాళీ చేయాలి అన్న ఉద్దేశ్యంలో నాగబాబు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికితోడు ఒకప్పుడు ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుని ‘జబర్దస్త్’ షోకు రకరకాల కారణాలతో దూరమైన ధన్ రాజ్ లాంటి సెలెబ్రెటీలను నాగబాబు లోకల్ గ్యాంగ్ షోలోకి ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రోజా కూడ అలాంటి వ్యక్తుల కోసం ‘జబర్దస్త్’ టీమ్ ద్వారా మెసేజ్ లు పంపుతున్నట్లు సమాచారం. దీనితో ఇప్పటి వరకు స్నేహితులుగా కొనసాగిన నాగబాబు రోజాల ఇగో వార్ గా వీరిద్దరూ హోస్ట్ చేస్తున్న షోలు మారబోతున్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..