పవన్ చిరంజీవి మధ్య గ్యాప్ ను పెంచుతున్న ఆ స్థానం !
చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా మాత్రమే కొనసాగకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవిడిని వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా మనసు పెట్టి వరసగా సినిమాలు చేసి ఉంటే చిరంజీవి రేంజ్ ని కూడ అతడు దాటి ఉండేవాడని అతడి వీరాభిమానులు అభిప్రాయపడుతూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చిరంజీవి ఫ్యామిలీ హీరోల స్థానాల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి తరువాత మెగా అభిమానులు ఆ ఫ్యామిలీ హీరోల నెంబర్ 2 స్థానాన్ని పవన్ కు కట్టబడుతు వచ్చారు. పవన్ సినిమాలను వదిలి రాజకీయాల బాట పట్టడంతో పవన్ వీరాభిమానులు అంతా రామ్ చరణ్ అభిమానులుగా మారిపోయారు.
దీనితో ఈమధ్య కాలంలో చరణ్ ఫ్యాన్స్ సంఖ్య కూడ విపరీతంగా పెరిగి చిరంజీవి తరువాత మెగా హీరోల నెంబర్ 2 స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అయితే అన్నీ అంచనాలు ప్రకారం జరిగి పవన్ నిజంగానే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తే ఇప్పుడు చరణ్ అభిమానులుగా చలామణి అవుతున్న చాలామంది తిరిగి పవన్ కళ్యాణ్ అభిమానులుగా యూటర్న్ తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
అదే జరిగితే చిరంజీవి తరువాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న రామ్ చరణ్ స్థానంలోకి పవన్ కళ్యాణ్ రావడం ఖాయమని అందువల్ల మళ్ళీ మెగా హీరోల స్థానాలలో మార్పులు జరిగే ఆస్కారం ఉంది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు చిరంజీవికి మళ్ళీ పవన్ యూటర్న్ తీసుకుని సినిమాలలోకి వచ్చి రెండు పడవల ప్రయాణాన్ని చేయడం పూర్తిగా ఇష్టం లేదు అంటూ మరికొందరు మరో గాసిప్పును ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఇది అంతా గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం అనీ మెగా ఫ్యామిలీ హీరోల స్థానంలో నెంబర్ 2 అన్న ప్రసక్తి లేదనీ పవన్ కళ్యాణ్ తో సహా అందరు చిరంజీవి ఇమేజ్ ని జీవితాంతం కొనసాగించ వలసిన హీరోలు మాత్రమే అంటూ అభిప్రాయపడుతున్నారు..