హీరోల రేంజ్ లో సుడిగాలి సుధీర్ డాన్స్ లు... చూస్తే ఔరా అనాల్సిందే.?
సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఈ పేరు ఆ బ్రాండ్ లా మారిపోయేలా కనిపిస్తోంది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుదీర్... తనదైన స్టైల్ కామెడీతో జబర్దస్త్ టీం లీడర్ గా మారిపోయాడు. అయితే జబర్దస్త్ కమెడియన్స్ అందరిలో ఎక్కువ పాపులారిటీ పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సుధీర్ మాత్రమే. అయితే అందరికీ ఒక కామెడీ లో మాత్రమే పాపులారిటీ వస్తే... సుధీర్ కు మాత్రం కామెడీ లోనే కాదు అటు యాంకరింగ్ లో... ఇటు డాన్స్ లో... మరోవైపు మెజీషియన్ గా ఇలా ప్రతి దాంట్లో తన సత్తా చాటుకుంటూ ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు సుడిగాలి సుదీర్.హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించి బుల్లి తెరపై తన హవా నడిపిస్తున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ కు మాత్రమే పరిమితమైన సుధీర్... ఇప్పుడు ఏ ఛానల్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడ ప్రత్యక్షమై పోతున్నాడు. తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులందరినీ మరిపించటమే కాదు... తన మ్యాజిక్ షో లో అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు సుడిగాలి సుదీర్.
మొన్నటివరకు సినిమా హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్... ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు. ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ నటిస్తున్న సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా 3మంకీస్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుదీర్ సినిమా కోసం అటు సుదీర్ అభిమానులు అందరూ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో మాస్ హీరో రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుదీర్. తాజాగా విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ నటిస్తున్న సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో విడుదలైంది. ఈ సాంగ్ లో సుడిగాలి సుధీర్ డాన్స్ లు అందరినీ ఔరా అనిపిస్తున్నాయి.
మామూలుగానే సుధీర్ డాన్సులు ఇరగదీస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. తన కోరిక అయినా సినిమా హీరో అవకాశం రావడంతో తన టాలెంట్ ని మొత్తం ప్రూవ్ చేస్తుకుంటున్నాడు సుడిగాలి సుధీర్. తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియో లో స్టార్ హీరోల రేంజిలో డాన్స్ లు కుమ్మేస్తున్నాడు. అయితే అటు సుడిగాలి సుదీర్ నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాపై అటు సుధీర్ అభిమానులే సుధీర్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. తన సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్స్ సినిమాల్లో హీరోగా నటించడం కొత్తేమి కాదు. గతంలో కూడా ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ లాంటి వాళ్లు కూడా హీరోలుగా సినిమాలు చేశారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. దీంతో వాళ్లు మళ్లీ కమెడియన్స్ గానే ఉండిపోయారు. మరి ఇప్పుడు సుధీర్ మాత్రం సక్సెస్ అందుకుంటా అంటూ నమ్మకంతో ఉన్నాడు. మరి సుడిగాలి సుదీర్ బుల్లితెరపై తన సత్తా చాటి విజయం సాధించినట్లే వెండితెరపై కూడా సత్తాను ఎంతవరకు నిరూపించుకుంటాడు అని తెలియాలంటే సుడిగాలి సుదీర్ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.