
వర్మ సాక్షిగా జూ. ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు లాగేసుకుంటాడా.?
జూనియర్ ఎన్టీఆర్... ఇది గత కొంతకాలంగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం చంద్రబాబుకు తలనొప్పిగా మారిన పేరు. నారా లోకేష్ కు భయం పుట్టిస్తున్న పేరు. టిడిపి రాజకీయాల్లో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైన వల్లభనేని వంశీ గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ విషయం తెస్తున్న విషయం తెలిసిందే . టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ ను ఎన్టీఆర్ తో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ కి ఎన్టీఆర్ కి అసలు పొంతనే లేదని నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ మంత్రి కొడాలి నాని కూడా చంద్రబాబును ఘాటు విమర్శలు చేస్తారు.
చంద్రబాబు పని అయిపోయిందని పార్టీ బాగుపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి రావాలని లేకపోతే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళితే తప్ప పార్టీకి పూర్వవైభవం రాదనీ తెలిపారు కొడాలి నాని. అయితే దీనిపై చంద్రబాబు మాత్రం పంపించలేదు. టీడీపీ నేత వర్ల రామయ్య తమ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని తమ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ అంటూ తెలిపిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత వర్ల రామయ్య తో చంద్రబాబు నాయుడే అలా మాట్లాడించాడు అంటూ ఆంధ్ర రాజకీయాల్లో చర్చ కూడా జరుగుతోంది.
అయితే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా కూడా టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది . ఎందుకంటే ఇప్పటివరకు విడుదల చేసిన పప్పు లాంటి అబ్బాయి పాటనే కాకుండా ట్రైలర్లో కూడా చంద్రబాబు గురించి ఎక్కువగా మాట్లాడడు . తాజాగా సినిమా సెకండ్ ట్రైలర్ లో కూడా బుడ్డోడు పార్టీ ని లాగేసుకుంటే అనే డైలాగ్ పెట్టారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ డైలాగ్ అర్థం ఏంటని ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ నడుస్తుంది . ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తాయని భావించే వర్మ ఇలాంటి డైలాగ్ పెట్టారా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన మోసాన్ని మొత్తాన్ని చూపించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చంద్రబాబు గురించి ఇంకా ఏన్ని నిజాలు చెప్పాలి అనుకుంటున్నారో అంటూ కూడా చర్చ నడుస్తోంది.