2013 సంవత్సరం చివరకు వచ్చేసింది. ఇప్పటివరకు విడుదల అయిన 170 పై చిలుకు సినిమాలలో సరిగ్గా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిన సినిమాల సంఖ్య 12నుంచి14సినిమాలు మించి లేవు అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. పెద్దపెద్ద హీరోల సినిమాలు దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు చాలా అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు గాలిలో ఆవిరి ఐపోయాయి.
‘మిర్చి’, ‘బాదుషా’, ‘నాయక్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, గుండెజారి గల్లంతైయిందే’, ‘బలుపు’, ‘తడాఖా’, ‘ప్రేమకధా చిత్రమ్’, ‘స్వామిరారా’, ‘అంతకుముందు ఆతరువాత’ సినిమాలు తప్పా మిగతా సినిమాలు అన్నీ కూడా అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దాదాపు 100 సినిమాల నిర్మాతలకు ఖర్చు పెట్టిన డబ్బులో సగం కూడా రాకపోవడం టాలీవుడ్ పరిశ్రమను షేక్ చేస్తోంది. కేవలం ఒక్క ‘అత్తారింటికి దారేది’ సినిమా ఇప్పటి వరకు 85 కోట్లు వరకు వసూలు చేసి టాలీవుడ్ రికార్డు క్రియేట్ చేసి కాంతులు విరజిమ్ముతున్నా ఆ వెలుగులకు అందని ఎందరో నిర్మాతల కన్నీటి గాధలు ఫిలింనగర్ లో కధలుకధలు గా వినిపడుతున్నాయి
‘రామయ్యా వస్తావయ్యా’, ‘షాడో’, ‘గ్రీకువీరుడు’, భాయ్’, ‘ఇద్దరమ్మాయిలతో,’ ‘తుఫాన్’, ‘మసాలా’ లాంటి భారీ సినిమాలు తీసిన నిర్మాతలు దాదాపు 10 కోట్ల నుండి 20 వరకూ భారీ నష్టాలను చవిచుసారని ఫిలింనగర్ టాక్. ఇలాంటి పరిస్థితి వచ్చే సంవత్సరం కూడా కొనసాగితే ఇక టాలీవుడ్ లో భారీ సినిమాలను తీసే నిర్మాతలు కరువైపోతారు అంటు ఫిలింనగర్ లో మాటలు వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా ఈ సంవత్సరం టాలీవుడ్ కు 300 కోట్లు నష్టాలు ఇచ్చిన సంవత్సరంగా మిగిలిపోతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: