రామ్ గోపాల్ వర్మ తన ట్విట్స్ తో ఎలాంటి వ్యక్తిని అయినా ఖంగారు పెడతాడు. అలాంటి వర్మ రాజమౌళిని కులాల ఉచ్చులోకి లాగడానికి చేసిన ప్రయత్నానికి రాజమౌళి ఖంగారు పది వర్మకు సమాధానం ఇచ్చిన ఆ సక్తికర సంఘటన లేటెస్ట్ గా జరిగింది.
ప్రస్తుతం వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీకి హైక్ తీసుకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్న విషయం పై స్పందిస్తూ వర్మ ఒక సెటైర్ వేసాడు.``జోకర్ హాలీవుడ్ మూవీ ఇండియాలో అంత పెద్ద హిట్టు అయితే కేఏ పాల్ మీద బయోపిక్ కూడా `బాహుబలి 3` కంటే పెద్ద హిట్టు అవుతుంది. కే.ఏ. పాల్ తో ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటికే చర్చలు సాగిస్తున్నారని విన్నాను. పాల్ నా ఒక్కడికి ఫోన్ చేసి స్వయంగా చెప్పారు.. `` అంటూ ట్వీట్ చేసి రాజమౌళిని వర్మ ఖంగారు పెట్టాడు.
ఈ ట్విట్ వచ్చిన కొద్ది సేపటికే రాజమౌళి ఖంగారు పడి స్పందిస్తూ వర్మను టార్గెట్ చేస్తూ రీ ట్విట్ చేసాడు. ``నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి `రాజు` గారు!`` అంటూ రిప్లయ్ఇచ్చాడు. దీనితో రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్ కూడ వర్మ మాటలకు బెదిరిపోతారని తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు వర్మ తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీలో కేఏ పాల్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అని తెలుస్తోంది. ఈ పాత్రకు వర్మ ఎవర్ని ఎంపిక చేసాడు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా వర్మ రాజమౌళిని టార్గెట్ చేస్తూ చేసిన ట్విట్ లో కేఏ. పాల్ ప్రస్తావన తీసుకు రావడం వెనుక ఉద్దేశ్యం ఇదే అని అంటున్నారు. అయితే అసలు విషయాలు తెలియని రాజమౌళి వర్మ ట్విట్ ను చూసి ఖంగారు పడటం ఎవరికైనా హాస్యాస్పదంగా ఉంటుంది..