ఖైది.. ఆ టైటిల్ లోనే ఓ మ్యాజిక్ ఉంది.. అందుకే సూపర్ హిట్..!

shami
ఖైది ఈ టైటిల్ కు ఒక హిస్టరీ ఉంది.. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ కు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా అది. ఖైది టైటిల్ తో తన స్టామినా నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. పదేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ కూడా ఖైది నంబర్ 150 అంటూ సెన్సేషనల్ హిట్ కొట్టాడు. అయితే ఈ ఖైది టైటిల్ తో ఏ సినిమా వచ్చినా అది హిట్టే.


అది మరోసారి కార్తి సినిమాతో ప్రూవ్ అయ్యింది. తమిళ హీరో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఖైది శుక్రవారం రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఒక సినిమాకు టైటిల్ ఎంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందో ఈ సినిమా చూసి చెప్పొచ్చు. కార్తి సినిమాకు ఖైది అన్న టైటిల్ పెట్టినప్పుడు మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు.


ఖైది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కార్తి చిరు సర్ సినిమా టైటిల్ ను చెడగొట్టలేదని అన్నాడు. చెప్పినట్టుగానే ఖైది సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు కార్తి. సినిమాలో సాంగ్స్, రొమాన్స్ అసలు హీరోయిన్ కూడా లేకుండా పెద్ద సాహసమే చేశాడు. శుక్రవారం పోటీగా విజయ్ విజిల్ సినిమా కూడా రిలీజైనా కూడా తెలుగులో కార్తికి ఉన్న క్రేజ్ ఇంకా సినిమా టైటిల్ ఖైది అన్న సెంటిమెంట్ కూడా తోడై సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.


అటు తమిళంలో కూడా ఖైది సినిమా హిట్ అయ్యిందని తెలుస్తుంది. విజయ్ విజిల్ మాత్రం రెగ్యులర్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలానే వచ్చిందని తెలుస్తుంది. అయితే తమిళంలో విజయ్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ కమర్షియల్ గ వర్క్ అవుట్ అవ్వొచ్చు కాని తెలుగులో మాత్రం విజయ్ మీద కార్తి పైచేయి సాధించాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: