1980 – 1990 ప్రాంతాల మధ్య టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన అలనాటి హీరోలు హీరోయిన్స్ అందర్నీ ఒకచోట కలిపే కార్యక్రమానికి ‘రీయూనియన్ పార్టీ’ అన్న పేరు పెట్టి అప్పటి కాలంలో ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోలు హీరోయిన్స్ ప్రతి సంవత్సరం ఒకచోట కలిసి ఒకరోజు అంతా సరదాగా గడిపే కార్యక్రమానికి ఒకనాటి హీరోయిన్ రాధిక శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం మొట్టమొదట 10 సంవత్సరాల క్రితం చిరంజీవి ఇంట్లో ప్రారంభం అయింది.
ఆ కార్యక్రమాన్ని ఎటువంటి బ్రేక్ లేకుండా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ఇంటిలో హోస్ట్ చేసేలా సుహాసినీ సుమలతలు చాల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చాల విభిన్నంగా చెన్నై బెంగుళూరులలో నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం అయి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈసారి ఈ ‘రీయూనియన్’ పార్టీని చిరంజీవి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని హోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి రావలసిందిగా చిరంజీవి తనతో నటించిన చాలామంది గ్లామర్ బ్యూటీలతో పాటు బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు టాక్. ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండ హాజర్ అయ్యే బాలకృష్ణ తాను చిరంజీవి హోస్ట్ చేస్తున్న ఈ పార్టీకి వస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీ నవంబర్ లో జరగనుంది అని తెలుస్తోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన ఇంటిని రీమోడలింగ్ చేయడంతో సరికొత్త సొగసులతో ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఆ ఇల్లు తయారైంది అని తెలుస్తోంది. ఇప్పుడు అదే ఇంటిలో చిరంజీవి ఇచ్చే ఆతిధ్యం అందుకోవడానికి బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ మోహన్ బాబు మోహన్ లాల్ సుహాసిని ఖుష్బూ రాధిక సుమలత సీనియర్ నరేశ్ అర్జున్ జాకీ ష్రాఫ్ రమ్యకృష్ణ ప్రభు శోభన నదియా సుమన్ లతో పాటు మరెందరో అలనాటి గ్లామర్ హీరోలు హీరోయిన్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సరదా కార్యక్రమాలలో విపరీతమైన సందడి చేయడం బాలయ్య సొంతం. దీనితో చిరంజీవి ఇంటిలో బాలయ్య సందడికి సంబంధించిన ఫోటోలు త్వరలో మీడియాకు లీక్ కాబోతున్నాయి అనుకోవాలి..