చిరంజీవి స్థానం పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
నిర్మాతగా దర్శకుడుగా తమ్మారెడ్డి భరద్వాజ పెద్దగా విజయాలు సాధించలేకపోయినా ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘నా ఆలోచన’ వెబ్ ఛానల్ ద్వారా తమ్మారెడ్డి అనేక సంచలన వ్యాఖ్యలకు చిరునామాగా మారుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈయన చిరంజీవి దాసరి లను పోలుస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

‘సైరా’ మూవీని చూడమని చెపుతూ చిరంజీవి అనేకమంది రాజకీయ ప్రముఖులను కలిసిన విషయం పై స్పందిస్తూ చిరంజీవి రాజకీయంగా పదవులు పొందడానికి ‘సైరా’ ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడు అని వచ్చిన వార్తల పై విభిన్నంగా స్పందించాడు. ఏ వ్యక్తికి అయినా పదవులు అడిగితే రావని అంటూ ఆ వ్యక్తి పై ఉన్న గౌరవంతో పాటు ఆ వ్యక్తితో రాజకీయ పార్టీల నేతలకు ఉన్న అవసరం బట్టి పదవులు వస్తాయని కామెంట్స్ చేసాడు. 

అదేవిధంగా దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయబోతున్నాడు అని వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ మరొక షాకింగ్ ట్విస్ట్ తమ్మారెడ్డి ఇచ్చాడు. దాసరి స్థానాన్ని ఎవరు పూడ్చాలేరానీ దాసరికి వచ్చిన గౌరవం పదవులు వల్ల డబ్బు వల్లా వచ్చింది కాదు అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ఏవ్యక్తి మరొక వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయలేరనీ ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందనీ చిరంజీవి దాసరితో పోల్చడం సరికాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 

దీనితో తమ్మారెడ్డి చిరంజీవి పై చేసిన కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అంటూ కొందరు లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి తమ్మారెడ్డి కి చిరంజీవికి మధ్య చిన్న గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనికితోడు తమ్మారెడ్డి కూడ అప్పుడప్పుడు చిరంజీవిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే కామెంట్స్ డైరెక్ట్ అటాక్ రూపంలో ఉండవు కాబట్టి తమ్మారెడ్డి వ్యాఖ్యల పై ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: