కలర్స్ స్వాతిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి తెలుగు సినిమాలలో నటించినా ఆమెకు చెప్పుకో తగ్గ అవకాశాలు మన టాలీవుడ్ లో రాకపోవడంతో కోలీవుడ్ బాట పట్టిన స్వాతి అక్కడ పేరుతో పాటు అవకాసాలను కూడా బాగా తెచ్చుకుంటోoది. ప్రస్తుతం ఆమెతమిళంలో జై హీరోగానటిస్తున్న ‘వడ కర్రీ’ అనే సినిమాలో నటిస్తోంది. శరవణ్ రాజన్ దర్శకత్వంలో ఈ ‘వడకర్రి’ సినిమా కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో నీలి చిత్రాల హీరోయిన్ గా పేరుగాంచిన సన్నిలియోన్ పక్కన స్వాతి కలిసి డాన్స్ చేయబోతోంది.
ఈ సినిమా ద్వారా స్పెషల్ సాంగ్‌తో కోలీవుడ్‌లో సన్నిలియోన్ అడుగుపెడుతోంది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేస్తున్న సాంగ్‌లో సన్నిలియోన్ తమిళతంబీలకు తన అందాల్ని హాట్ హాట్‌గా వడ్డిస్తానంటోంది. ఈ తరహా బాణీలంటే తనకెంతో ఇష్టమని సన్నిలియోన్ చెబుతోంది. ఏదేమైనా, ఇక సన్నిలియోన్ టాలీవుడ్లో అడుగుపెట్టడమే తరువాయి. ప్రస్తుతం సన్నీ జాక్ పాట్ రాగిణి యం యం ఎస్ సినిమాలతో బాక్సాఫీస్ పై విరుచుకు పడటానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.
మన తెలుగుమ్మాయి కలర్స్ స్వాతికి కోలీవుడ్ లో మరింత క్రేజ్ రావడానికి సన్నీ లియాన్ ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో హెల్ప్ అవుతుందనడంలో సందేహామే లేదు. ఎందుకంటే కలర్స్ స్వాతికి తమిళ్ లో కొంత ఫాలోయింగ్ వున్న..ఈ పోర్న్ స్టార్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే సన్నితో కలర్స్ స్వాతి కాలు జారితే మాత్రం భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలను తట్టుకోవాలని కలర్స్ స్వాతి అభిమానులు అంటున్నారు. ఏమైన కలర్స్ స్వాతి దైర్యానికి మెచ్చుకోవాలని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అంటే ఒక పొర్నస్టార్ తో ఇలాంటి సాహసం ఎవరు చేయరని కోలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఎదిఎమైనా కలర్స్ స్వాతి చేస్తున్న సాహసం ఆమెకు ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: