సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!

siri Madhukar
తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది సుమ కనకాల.  కెరీర్ బిగినింగ్ లో టివి నటిగా ఉన్నా..తర్వాత యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.  పుట్టింది కేరళాలో అయినా..అచ్చమైన తెలుగు అమ్మాయిలా సుమ ఎంతో చక్కటి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంది.  టివిలో నటిస్తున్న సమయంలో తన సహనటుడు రాజీవ్ కనకాల ప్రేమలో పడ్డ సుమ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, పిల్లలు తన కెరీర్ కి ఎంతమాత్రం అడ్డుకాదని టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. 

ప్రస్తుతం వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తున్న సుమ స్టార్ హీరోల మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీవీ షోస్ మాత్రమే కాదు..ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో కూడా తన సత్తా చాటుకుంటుంది సుమ. ఈ మద్య 'సుమక్క' అనే పేరుతో ఛానెల్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో వెరైటీ కామెడీ వీడియోలు అప్ లోడ్ చేస్తూ ఆకర్షిస్తుంది.

ఈ ఛానెల్ ని ఇప్పటివరకు రెండున్నర లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  తాజాగా తనే స్వయంగా మార్కెట్ కి వెళ్లి మరీ సాంబారుకి కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇంటికి వెళ్లి కిచెన్ రూమ్ లో తన ఫేవరేట్ సాంబార్ రెసిపీ ఫాలో అవుతూ వంటకం సిద్ధం చేసింది. ఇక సుమ చేసిన కేరళా సాంబార్ రుచి చూడాల్సిందే అంటుంది.


Find Out More:

Related Articles: