'సైరా' తమన్నాకు ఎందుకంత స్పెషలో తెలుసా.....!

Mari Sithara
మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతారల కలయికలో వచ్చిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి, రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో తమన్నా, నిహారిక, అనుష్క, అమిత బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్, పృథ్వి తదితరులు పలు ఇతర పాత్రల్లో నటించారు. రత్నవేలు కెమెరా మ్యాన్ గా పని చేసిన ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చడం జరిగింది. 

ఇక పరుచూరి బ్రదర్స్ అందించిన ఈ సినిమా కథకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు. ఇక మెగాస్టార్ ఈ సినిమలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించారు. అయితే సినిమాలో మాత్రం చాలానే లోపాలున్నట్లు మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. ఓవర్ ఆల్ గా సినిమా బాగానే ఉందని, అయితే తాము అనుకున్న భారీ అంచనాలు అందుకునేలా అయితే సైరా లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో నటించిన తమన్నాకు సైరా ఎంతో స్పెషల్ సినిమాగా నిలిచిందనే చెప్పాలి. నిన్న నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో తమన్నా మాట్లాడుతూ, 

సరిగ్గా పుష్కర కాలం క్రిందట తాను నటించిన హ్యాపీ డేస్ సినిమా ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ హిట్ సాధించి తన కెరీర్ కు మంచి బ్రేక్ ని ఇచ్చిందని అన్నారు. ఇక మళ్ళి ఇన్నేళ్ల తరువాత సరిగ్గా అదే రోజున సైరా నరసింహారెడ్డి రిలీజ్ అయి తనకు నటిగా ఎంతో గుర్తింపునిచ్చిందని, ఇది ఒకరకంగా యాదృచ్చికమే  అయినప్పటికీ, ఈ సినిమాలోని లక్ష్మి పాత్ర తరువాత, బయట కొందరు తనని లక్ష్మి నరసింహారెడ్డి అనే పిలుస్తున్నారు అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: