పవన్ సామాన్యంగా తనతో నటించిన ఏ హీరోయిన్ ను పోగడడు. కానీ సమంత ఏమిమాయ చేసిందో తెలియదు కానీ, ఈమె సేవా కార్యక్రమాలకు, సమాజ సేవ పట్ల ఉన్న ఆమె కమిట్ మెంట్ కు పవన్ బహిరంగగానే పొగుడుతూ ఉంటాడు. సమంతకూడా అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. ఈ మధ్యన ‘అత్తారింటికి దారేది' 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చారిటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ చిత్ర హీరోయిన్ సమంత హాజరయ్యారు.
సమంత చేతుల మీదుగా ఓ చిన్నారికి సహాయం అందించారు. ఈ సందర్భంగా సమంత అభిమానులను ప్రశంసించింది. అంతేకాదు పవన్ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన సహాయం ఎప్పుడూ ఉంటుందని భారీ వాగ్ధానం కూడా చేసిసింది. అతి తక్కువ కాలంలో కేవలం 5 రోజుల్లోనే 40 కోట్లు వసూలు చేసి, టాప్ 3 సౌత్ ఇండియా సినిమాలలో స్థానంపొందిన పవన్ ‘అత్తారిలల్లు’ ఓవర్సీస్‌లో 10 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డుకు ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే.
‘మగధీర’ రికార్డులను బ్రేక్ చేసి 100 కోట్ల టార్గెట్ వైపు పరుగులు పెడుతున్న ‘అత్తారింటి’ సినిమా క్రేజ్ తో రాష్ట్ర వ్యాప్తంగా పవనిజం మరింత ఉవ్వెత్తున లేచి పవన్ అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పవనిజాన్ని సార్ధకత చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: