సైరా రెండవ ట్రయిలర్ వెనుక రాజకీయం !

Seetha Sailaja
‘సైరా’ విడుదలకు ఇక కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించి మరొక ట్రైలర్ విడుదల చేసే నిర్ణయం చరణ్ చిరంజీవిలు తీసుకోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ‘సైరా’ మొదటి ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 

ఇలాంటి పరిస్థితులలో ఇంత హడావిడిగా ఈ రెండవ ట్రైలర్ ఆలోచన మెగా కాంపౌండ్ కు ఎందుకు వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు.

వాస్తవానికి ‘సైరా’ కు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన మ్యానియా ఏర్పడినా ఇంకా బాలీవుడ్ లో మాత్రం అటువంటి మ్యానియా కనిపించడం లేదు అని అంటున్నారు. ‘సైరా’ ఓపెనింగ్ కలక్షన్స్ రికార్డులు సృష్టించాలి అంటే బాలీవుడ్ లో కూడ ఈ మూవీకి విపరీతమైన స్పందన రావాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని పూర్తి యాక్షన్ సీన్స్ తో కూడిన మరొక ట్రైలర్ ను రెడీ చేసి ఈ రోజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ప్రక్షకులు విపరీతంగా యాక్షన్ సీన్స్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి మరింత హైక్ తీసుకు రావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. ఉత్తరాది రాష్ట్రాలలో 1500 వందల ధియేటర్లలో ‘సైరా’ ను విడుదల చేస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్ కు చరణ్ కోరుకున్న రీతిలో భారీ మొత్తాలను హిందీ ఛానల్స్ ఇవ్వడానికి ఇంకా ముందుకు రాకపోవడంతో వ్యూహాత్మకంగా క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి ఈ రెండవ ట్రైలర్ ప్రయత్నం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ‘సైరా’ కు ఒక్క తెలుగు రాష్ట్రాలలో మినహా ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో కూడ విపరీతమైన క్రేజ్ ఏర్పడక పోవడం చరణ్ ను కలవర పెడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: