ఛానల్స్ ను భయపెడుతున్న గీతామాధురి

K Prakesh
గాయని గీతా మాధురి – హీరో నందు ని గత రెండు సంవత్సరాలుగా ఘాడంగా ప్రేమించి చివరకు ఇరువురి పెద్దల అంగీకారంతో గత సోమవారం నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తతో పాటు గీతామాధురి నందుల నిశ్చితార్ధం ఫోటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నెటిజన్లు విపరీతంగా చూసారు. హస్కీ వాయస్ సింగర్ గా పేరు గాంచిన గీతామాధురి తన హాట్ లుక్ తో స్టేజి షోల పై ఇరగ దీస్తోంది. గీతామాధురి నందూల వివాహం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9న జరగబోతోంది. అయితే స్టేజ్ షోల తో బాగా సంపాదిస్తున్న గీతామాధురికి తన పెళ్ళి వీడియో రేట్లను అమ్ముదామనే ఆలోచన వచ్చింది. గీతామాధురి కి ఉన్న పరిచియాల రీత్యా ఆమె వివాహానికి టాలీవుడ్ సెలెబ్రెటీలంతా వచ్చే అవకాశం ఉంది. ఆమె పెళ్లి ఫోటోలను వీడియో క్లిప్పింగ్ లను ఛానళ్ళలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు కాబట్టి గీతామాధురి తన పెళ్ళి అఫీషియల్ టెలికాస్టింగ్ రైట్లను ఇప్పటి నుంచే అధికారకంగా అమ్మకానికి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు గ్రహించిన ఎలట్రానిక్ మీడియా వారు ఇప్పటి నుంచే గీతామాధురితో బేరసారాలు మొదలుపెట్టారట. కానీ తన పెళ్ళి అఫీషియల్ టెలికాస్టింగ్ రైట్లను ఎదో ఒక ప్రత్యేక ఛానల్ కు ఇవ్వడానికి ఆ ఛానల్ మార్కెటింగ్ విభాగం అధినేతలు అదిరిపోయే రేట్లను కోట్ చేస్తూ గీతామాధురి అదరగోడుతోంది అంటు వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక ప్రముఖ తమిళ ఛానల్ కు హీరోయిన్ స్నేహ కోటి రూపాయలు పుచ్చుకుని తన మేరేజ్ టెలికాస్టింగ్ రైట్లు అమ్మి సంచలనం సృష్టించింది. మరి గీతామాధురి రేట్ ఎంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: