సూపర్ మహేష్ బాబుకు జయసుధ దూరపు చుట్టం అవుతుంది. వీరిద్దరూ నటించిన సినిమాలు అతి తక్కువే అయినా మహేష్ మనస్తత్వం గురించి తనకు తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు అంటూ కామెంట్స్ చేసింది.
ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. మహేష్ మొదట్లో ఎవరితో అయినా పరిచయం పెరిగే వరకు చాల రిజర్వ్డ్ గా ఉంటాడని అయితే ఒకసారి సాన్నిహిత్యం ఏర్పడిన తరువాత మహేష్ వేసే జోక్స్ అదేవిధంగా అతడు చేసే అల్లరి తట్టుకోవడం చాల కష్టం అంటూ జయసుధ కామెంట్స్ చేసింది.
మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండే రోజులలో ‘పోరాటం’ అన్న సినిమాలో తాను అప్పటి మహేష్ తో నటించన రోజులను గుర్తుకు చేసుకుంటూ అతి బిడియంతో చాల భయంగా కనిపించే మహేష్ ను చూసి అప్పట్లో అతడు సినిమాలకు పనికి వస్తాడా అన్న సందేహాలు తనకు కలిగిన విషయాన్ని జయసుధ గుర్తుకు చేసుకుంది. అయితే మహేష్ సూపర్ స్టార్ అయిన తరువాత తాను అతడితో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ ‘బ్రహ్మోత్సవం’ ‘మహర్షి’ సినిమాలలో నటించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ పైకి హుందాగా కనిపిస్తూనే ఒకేసారి తన చిలిపితనం బయటపెడుతూ మహేష్ వేసే జోక్స్ కు నవ్వని వారు ఉండరు అంటూ కామెంట్స్ చేసింది.
ఇదే సందర్భంలో మహేష్ యాక్షన్ స్టామినా గురించి మాట్లాడుతూ హాస్య సన్నివేశాలలో మహేష్ నటించినంత ఫ్రీగా మరి ఏ టాప్ హీరో నటించలేడనీ అయితే ఇప్పటి వరకు మహేష్ ను ఆ యాంగిల్ లో ప్రాజెక్ట్ చేస్తూ తీసిన సినిమా రాకపోవడం ఆశ్చర్యకరం అని అంటోంది ఈ సహజనటి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ అంతా కామెడీ సన్నివేశాలతో ఎక్కువగా ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ లోని కామెడీ యాంగిల్ పరాకాష్ట ఈమూవీలో కనిపిస్తుందా అన్న సందేహాలు జయసుధ మాటలు బట్టి అనిపించడం సహజం..