చిరంజీవి అంటే ఆమాత్రం ఉండాలిగా..
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వాసంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సైరా సినిమానే మెగాస్టార్ రీఎంట్రీ సినిమాగా చేద్దాం అని మొదట భావించినా అది వర్కౌట్ కాలేదు. ఈ సైరా మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అందరికి తెలిసిందే.మెగాస్టార్ కి ఎంతో ఇష్టమైన సినిమా కావడంతో ఈ సినిమా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా 250 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది అని తెలుస్తుంది. మెగాస్టార్ సినీ కెరియర్ లో హై బడ్జెట్ మూవీ ఈ సైరానే. ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు.
ఇందులో మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ..అయన సరసన నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో క్వీన్ ఆఫ్ సినీ ఇండస్ట్రీగా పేరుతెచ్చుకున్న నయనతార నటిస్తుంది. అలాగే నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్, కీలక పాత్రలలో కిచ్చా సుదీప్ , విజయసేతుపతి , తమన్నా నటిస్తుంది. అలాగే రాణి లక్ష్మీబాయి గా అనుష్క కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్స్ , టీజర్స్ , ట్రైలర్స్ అన్ని కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి, మెగాస్టార్ కెరియర్ లో బిగెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే.
అలాగే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించడం తో తెలుగుతో పాటుగా హిందీ , తమిళం , కన్నడ , మలయాళంలో విడుదల చేయనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి భారీగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. అలాగే డిజిటల్స్ రైట్స్ సుమారుగా 40 కోట్లకి అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ కెరియర్ లోనే అత్యధికమైన స్క్రీన్స్ లలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కాకముందే పలు రికార్డ్స్ ని కొల్లగొట్టిన సైరా .. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ ని కొల్లగొడుతుందో చూడాలి. ఏమైనా మెగాస్టార్ రేంజ్ కి సరిగ్గా సరితూగే సినిమా చాలా రోజుల తరువాత రాబోతుంది అని చెప్పవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Chiranjeevi
-
Telugu
-
Hero
-
Khaidi.
-
Khaidi new
-
v v vinayak
-
Tamil
-
Remake
-
Cinema
-
Chitram
-
uyyalawada narasimha reddy
-
history
-
Saira Narasimhareddy
-
Ram Charan Teja
-
Konidela Production
-
Director
-
Reddy
-
Wife
-
Queen
-
nayantara
-
Kiccha Sudeep
-
tamannaah bhatia
-
rani
-
anoushka
-
Anushka
-
India
-
Hindi
-
Kannada
-
Amazon
-
Mohandas Karamchand Gandhi
-
October