ఒకరినొకరు తిరస్కరించుకున్న సమంత పివి సింధు !

Seetha Sailaja
క్రేజీ బ్యూటి సమంత ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన ‘ఓ బేబి’ హిట్ అయిన తరువాత కూడ మరేమీ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ తో ’96’ రీమేక్ లో నటిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈమె లేటెస్ట్ గా తన పై వస్తున్న కొన్ని వార్తల పై స్పందించింది. 

ప్రముఖ బ్యాడ్మెంటన్ క్రీడా కారిణి పివి సింధు ఈమధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మెంటెన్ ఛాంపియన్ షిప్ విజేతగా మారిన నేపధ్యంలో ఆమె పై ఒక బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చాలామంది దర్శక నిర్మాతలకు వచ్చాయి. ఈ ఆలోచనలలో కొందరు సింధు పాత్రకు సమంత అన్ని విధాల సరిపోతుంది అన్న ఆలోచనలు చేస్తున్నారు అని కూడ వార్తలు వచ్చాయి. 

ఇప్పుడు ఈ వార్తల పై సమంత తనదైన రీతిలో స్పంధించింది. వెండి తెర పై పివి సింధు పాత్ర చేసి మెప్పించాలి అంటే తాను బ్యాడ్మెంటన్ బాగా నేర్చుకుని శ్రమ పడాలని అలాంటి కష్టం ఇప్పుడు పడలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత కామెంట్స్ సింధు దృష్టి వరకు వెళ్ళడంతో ఈ విషయం పై మరొక విధంగా స్పంధించింది.

తన బయోపిక్ ను తీసే ఆలోచన ఎవరైనా చేసినా తాను ప్రోత్సహించను అని చెపుతూ తన బయోపిక్ లో సమంత నటిస్తే ఆ బయోపిక్ కు న్యాయం జరగదు అంటూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తానికి ఎవరైనా తన బయోపిక్ తీయాలి అని భావిస్తే తన పాత్రను చేసి మెప్పించగల సామర్ధ్యం ఒక్క దీపికా పదుకొనె కు మాత్రమే ఉంది అంటూ దానికి కారణం దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనె ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడంతో దీపిక తన పాత్రకు అన్ని విధాల సరిపోతుంది అని అంటూ సింధు అభిప్రాయపడుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: