యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో పక్కా వ్యూహంతో బాలీవుడ్ కు బాటలు వేసుకోవాలని కన్న కలలు రివర్స్ అయ్యాయి. ఆ కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌క నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతోనే సుజీత్ డైరెక్షన్‌లో ఏకంగా రూ.350 కోట్లు పెట్టి మరీ సాహో లాంటి పాన్ ఇండియా సినిమా చేశాడు. ఈ సినిమాతో నేషనల్ వైడ్‌గా తనకు ఉన్న స్టార్‌డమ్, క్రేజ్, మార్కెట్ కంటిన్యూ చేసుకోవాలని కలలు కన్నాడు.
అయితే సీన్ రివర్స్ అయ్యింది. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ కాస్తా సాహోతో డామేజ్ అయినట్లేనా ? అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ - బాలీవుడ్ సిని విశ్లేషకులు. బాహుబలి హిట్ అయ్యిందంటే అందులో ప్రభాస్ ఘనత కన్నా రాజమౌళి ఘనతే ఎక్కువ. అయితే ప్రభాస్ మళ్లీ బాహుబలి రేంజ్‌లో అంచనాలు ఉండే సినిమా చేయడం తప్పుకాకపోయినా అందుకు తగిన కథ, డైరెక్టర్‌ను ఎంచుకోలేదు.
కేవలం బడ్జెట్ కోట్లు కుమ్మరిస్తే సినిమా హిట్ చేసేస్తారనుకోవడం తప్పయ్యింది. ఈ సినిమా రిజల్ట్ ప్రభాస్‌కు ముందే తెలిసిపోయినట్లుంది. అందుకే భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం ఇక కుదరకపోవచ్చు అని ప్రభాస్ ముందే చెప్పాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో స్థానం సంపాదించాలని మెగాస్టార్ చిరంజీవి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా తుఫాన్ సినిమా చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు.
ఇక ఇప్పుడు ప్రభాస్‌కు బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత నేషనల్ హీరోగా ఎదిగేందుకు మంచి అవకాశం వచ్చినా అది అందుపుచ్చుకుని ఎదగడంలో విఫలమయ్యాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ అంచనాలు ఉండేలా కాకుండా మళ్లీ అంచనాలు తక్కువ ఉండేలా ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత మరో నేషనల్ కథతో సినిమా తీయాల్సిందని చాలా మంది చర్చించుకుంటున్నారు.