సాహో ఈవెంట్ ను దెబ్బకొట్ట బోతున్న సైరా !

Seetha Sailaja
ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ రికార్డుల గురించి మాత్రమే పోటీ ఉండేది. అయితే ‘సాహో’ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగడంతో ఇక రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడ కోట్లు ఖర్చుపెట్టి అత్యంత భారీగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

‘సాహో’ విడుదల తరువాత కేవలం 32 రోజుల గ్యాప్ తో ‘సైరా’ రాబోతున్న పరిస్థితులలో ‘సాహో’ ‘సైరా’ ల మధ్య కలక్షన్స్ రికార్డుల పోటీ అనివార్యంగా మారింది. దీనికితోడు ఈ రెండు సినిమాలు కూడ అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన నేపధ్యంలో ఈ రెండు మూవీలలో అంతిమంగా ఏ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంటుంది అన్న ఆతృత బాగా పెరిగిపోయింది. 

‘సైరా’ ట్రైలర్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైన నేపధ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వార్తలు కూడ ఊపు అందుకున్నాయి. వాస్తవానికి ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విజయవాడలో సెప్టెంబర్ మూడవ వారంలో నిర్వహించాలని చరణ్ భావించినట్లు సమాచారం. 

అయితే ‘సాహో’ ఈవెంట్ చూసిన తరువాత ఆ ఈవెంట్ స్థాయికి మించి హైదరాబాద్ లోనే ‘సైరా’ ఈవెంట్ ను సుమారు మూడు కోట్ల ఖర్చుతో నిర్వహించడానికి రామ్ చరణ్ ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో అప్పుడే చర్చలు మొదలు పెట్టినట్లు టాక్. అంతేకాదు ఈ హైదరాబాద్ ఈవెంట్ ముగిసిన తరువాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఇదే తరహా ఫంక్షన్ విజయవాడలో కూడ నిర్వహించి ‘సైరా’ మ్యానియాను తారాస్థాయికి తీసుకు వెళ్లాలని చరణ్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ రెండు సినిమాల కథలు వేరైనా అనుకోకుండా పరిస్థితులు మారిపోయి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే విషయంలో ప్రభాస్ చిరంజీవిల మధ్య పోటీ ఏర్పడటం అత్యంత ఆశ్చరకరం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: