పవన్ ఓటమికి సమాధానం ఇచ్చిన చిరంజీవి !

Seetha Sailaja
మరో నాలుగు రోజులలో చిరంజీవి పుట్టినరోజు రాబోతున్న సందర్భంలో ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలామందికి తెలియని అనేక విషయాలు చిరంజీవి షేర్ చేసాడు. 150 సినిమాలు పైగా నటించిన చిరంజీవికి చిన్నప్పుడు సినిమాలు చూడటం అంటే ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదట. 

అయితే అప్పట్లో రేడియోలో వచ్చే జ్యోతిలక్ష్మి పాటల ట్యూన్స్ కు అనుకోకుండా తనలో డాన్స్ మూమెంట్స్ వచ్చేవని అప్పటిదాకా తాను డాన్స్ బాగా చేయగలను అన్నవిషయం కూడ తనకు తెలియదు అంటూ ఒక విధంగా తనలోని డాన్సర్ ను తనకు తెలిసేలా చేసిన తొలి గురువు జ్యోతిలక్ష్మి అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో తన మెగా స్టార్ క్రేజ్ గురించి మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కంటే ఆ శిఖరం మీద శాస్వితంగా నిలబడటం చాలకష్టమని తన టాప్ హీరో ఇమేజ్ చెక్కు చెదరకుండా కొనసాగించడానికి తాను ఎంతో కష్టపడటమే కాకుండా ఈస్థాయి కోసం తాను ఎంతో పోరాటం చేసిన విషయాలను వివరించాడు.

ఇదే సందర్భంలో ఎన్నికలలో ‘జనసేన’ ఓటమి గురించి అదేవిధంగా పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓటమి చెందిన విషయాల గురించి చిరంజీవి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ కు వ్యక్తిత్వం ఎక్కువ అనీ ఎప్పుడు తన నీడలో ఎదగాలని ప్రయత్నించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కోసం తపన పడిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం పవన్ చేస్తున్నది జీవితకాలపు పోరాటం అంటూ చిన్నచిన్న ప్రతికూల పరిస్థితులకు బెదిరిపోయే మనస్థత్వం పవన్ కు లేదు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

అంతేకాదు పవన్ ఒక ఫైటర్ అనీ అలాంటి వ్యక్తులు జీవితంలో నిరంతరం పోరాడుతూనే ఉంటారనీ అయితే ఎదో ఒకరోజు అలాంటి వ్యక్తులకు విజయం వచ్చి తీరుతుందనీ అలాంటి విజయం తన తమ్ముడు జీవితంలో రావాలని తాను ఎదురు చూస్తున్నాను అంటూ విజయాన్ని అందుకోవడానికి పవన్ అన్నివిధాల అర్హుడు అంటూ కామెంట్స్ చేసాడు. ఇప్పటి వరకు పవన్ ఓటమి పై స్పందించని చిరంజీవి మొదటిసారి ఇలా వ్యూహాత్మకంగా స్పందించడంలో అనేక అర్ధాలు ఉన్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: