షూటింగ్ ఎగ్గొట్టి నందుకు జస్ట్ 4 కోట్ల ఫైన్ !!

K Prakesh
సినిమా రంగం అంటేనే రాజకీయాల మయం. అదే సినిమారంగానికి చెందినహీరో కానీ హీరోయిన్ కానీ రాజకీయాల లోకి వెళ్లి పదవులు పొందితే ఈ ఇగో లు మరింత పెరిగి పోతాయి . ప్రస్తుతం కన్నడ స్టార్ హీరోయిన్ రమ్యకు ఇదే పరిస్థితి ఎదురు అయ్యింది. ఇటీవల రమ్య రాజకీయాల లోకి వచ్చి ఎంపీగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ అనందంలో పడి ఈ భామ తను నటించవలసిన సినిమాలను నిర్లక్ష్యం చేస్తోందట. కాంగ్రెస్ లో కొనసాగుతున్న రమ్య ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో మాండ్య నియో జక వర్గం నుండి గెలుపొందింది. అయితే దీనికి ముందు ఈమె నీర్ దోసె అనే సినిమాలో నటిస్తూ మధ్యలో ఈ సినిమాను వదిలేసింది. దీనితో ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న జగ్గేష్ హీరోయిన్ రమ్య పై ఫైర్ అయి రమ్య ప్రవర్తన అనైతికం అంటూ ఆమె పై విమర్శలు చేయడమే కాకుండా ప్రస్తుతం ఈ 'నీర్ దోసె' దాదాపుగా 60 శాతం పూర్తయి మధ్యలో మిగిలిపోయింది కాబట్టి నిర్మాత ఇప్పటికే ఖర్చు పెట్టిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలు రమ్య తిరిగి ఇవ్వాలి అంటు కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఈసినిమా నిర్మాత చేత ఫిర్యాదు చేయించాడు. రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో కర్ణాటకా లో ప్రచార భాద్యత నిర్వర్తిస్తున్న రమ్య అటు 4 కోట్ల నష్టపరిహారం చెల్లించలేక అదేవిధంగా తనకున్న బిజీ షెడ్యుల్ లో నిర్మాతకోరిన కాల్ షీట్స్ ఇవ్వలేక కన్నడ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది రమ్య. ఇంత తతంగం జరగడానికి కారణం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న జగ్గేష్ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి ఈ విధంగా ఒక కన్నడ సినిమా రాజకీయాల మధ్య నలిగిపోవడం దక్షణాది చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: