అల్లు అర్జున్ ను దెబ్బకొట్టడానికి నవదీప్ మాస్టర్ ప్లాన్ !

Seetha Sailaja
యంగ్ హీరో నవదీప్ బయటకు చూడటానికి చాల సున్నితంగా కనిపిస్తాడు కాని స్వభావ రీత్యా అతడు చాల రఫ్. ‘బాద్ షా’ ‘ఆర్యా 2’ సినిమాలలో నవదీప్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ అతడు విలన్ గా కూడ పెద్దగా రాణించలేకపోయాడు. 

ఇలాంటి పరిస్థుతులలో నవదీప్ ఎప్పుడు లేని విధంగా చాల రఫ్ గా మారి కళ్ళు చెదిరే రీతిలో బాడీ బిల్డ్ చేసిన తన షాకింగ్ లుక్ ఫోటోలను మీడియాకు షేర్ చేసాడు. ప్రస్తుతం ఇతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో తీస్తున్న మూవీలో నటిస్తున్న నేపధ్యంలో ఈ లుక్ బన్నీ సినిమా కోసమే అంటూ ప్రచారం జరుగుతోంది. 

అంతేకాదు మరికొందరైతే బన్నీని భయపెట్టడానికి నవదీప్ ఇంత భంకరంగా తయారు కావాలా అంటూ జోక్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ లో నవదీప్ చేస్తున్నది ఒక నెగిటివ్ క్యారెక్టర్ కావడంతో ఆ క్యారెక్టర్ కోసం ఇలాంటి లుక్ ఏర్పరుచుకుని ఉంటాడు అన్న అంచనాలు వస్తున్నాయి. 

అల్లు అర్జున్ కు నవదీప్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా బన్నీ పట్టుపట్టి నవదీప్ కోసం త్రివిక్రమ్ చేత ఈ పాత్రను క్రియేట్ చేయించాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. నవదీప్ లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయిన కొద్ది గంటలలో వైరల్ కావడమే కాకుండా నవదీప్ సిక్స్ ప్యాక్ లుక్ పై రకుల్ ప్రీత్ మనసు పారేసుకుని ట్విట్ పెడితే మంచు విష్ణు నవదీప్ ను ద్వేషిస్తున్నాను అంటూ ట్విట్ చేసాడు. దీనితో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీతో తిరిగి నవదీప్ తిరిగి ట్రాక్ లోకి రాబోతున్నాడు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇంతకీ నవదీప్ ఏర్పరుచుకున్న ఈ లుక్ ఎవరికోసం అన్నది సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: