నిన్న కాకినాడలో జరిగిన ‘రణరంగం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. శర్వానంద్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతున్న సమయంలో కొందరు అభిమానులు వేదిక పైకి దూసుకు వచ్చి శర్వాకు దండలు వేయడమే కాకుండా అతడి కాళ్ళకు పాద నమస్కారాలు చేయడంతో ఆ అభిమానుల పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
అనవసరంగా తన కాళ్ళకు మొక్కి తనను గొప్పవాడిగా చూడవద్దని చెపుతూ అలా పాద నమస్కారాలు చేయాలి అనుకుంటే వారివారి తల్లితండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోమని అనవసరంగా తనలాంటి వాళ్లకు పాదనమస్కారాలు చేసి ఆ పాదనమస్కారాలకు ఉన్న పవిత్రను పోగొట్టవద్దు అంటూ శర్వా తన అభిమానులకు రివర్స్ పంచ్ వేసాడు. ఇదే సందర్భంలో శర్వానంద్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడ చేసాడు.
హైదరాబాద్ నుండి తాను పవన్ తో కలిసి ఒకే విమానంలో వచ్చిన విషయాన్ని బయటపెడుతూ తాను ఆవిమానంలో బిజినెస్ క్లాస్ లో కూర్చుని ప్రయాణం చేస్తే పవన్ అదేవిమానంలో ఎకానమీ క్లాస్ లో కూర్చుని సామాన్యుడిలా ప్రయాణం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో పవన్ ఎకానిమీ క్లాస్ లో ప్రయాణిస్తుంటే తాను బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేయడం తనకు తలవంపుగా మారింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఇదే విషయాన్ని తాను పవన్ తో ప్రస్తావిస్తే తాను జనం కోసం అన్నీ వదులుకుని వచ్చానని కానీ సినిమాలలో నటిస్తున్నావు కాబట్టి ఆమాత్రం స్థాయి కొనసాగించాలి అంటూ పవన్ తనతో ప్రస్తావించిన విషయాన్ని బయటపెట్టాడు. అలాంటి సంస్కారం ఉన్న వ్యక్తులకు పాద నమస్కారాలు చేయాలి కానీ తనలాంటి వాళ్లకు కాదు అంటూ శర్వానంద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి..