పూరి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న రామ్ కామెంట్స్ !

Seetha Sailaja
‘ఇస్మార్ట్ శంకర్’ భారీ సక్సస్ ను అందుకుని 75 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది అని వస్తున్న వార్తలు చాల మంది మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఇలాంటి సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్న పూరి జగన్నాథ్ కు రామ్ ఈ మధ్య మీడియాతో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వార్తలు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ఒకరోజు ముందు హాలిడే ట్రిప్ కోసం స్పెయిన్ వెళ్ళిన రామ్ ఈ సినిమా ప్రమోషన్ కు దూరంగా ఉన్నాడు. దీనితో సక్సస్ టాక్ వచ్చిన ఈ సినిమాను నిలబెట్టడానికి పూరి జగన్నాథ్ హీరో రామ్ పక్కన లేకుండానే ఒంటరిపోరాటం చేసాడు. 

ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ సంచలన విజయం ఖరార్ కావడంతో ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చిన రామ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సక్సస్ అవుతుందని తనకు ముందే తెలుసని అనడమే కాకుండా ఈ మూవీ కథను తాను పూరీతో కలిసి గోవాలో కలిసి కూర్చుని వ్రాసిన విషయాన్ని బయటపెట్టాడు. 

అంతేకాదు ఈ మూవీలోని ‘బ్యాడ్ బాయ్’ క్యారెక్టర్ తన ఆలోచన అని అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో పూరీకి రావలసిన క్రెడిట్స్ అన్నీ తనవే అంటూ రామ్ వ్యూహాత్మకంగా మాట్లాడటంతో రామ్ వ్యూహాలు మీడియాకు కూడ అర్ధం కాలేదని టాక్. ఇప్పటికే ఈ మూవీ లాభాల షేరింగ్ విషయంలో రామ్ పూరీలకు చిన్న గ్యాప్ ఉంది అని వార్తలు వస్తున్న పరిస్థితులలో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సస్ క్రెడిట్ ను పూరీ ఖాతా నుండి తన ఖాతాలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్  కామెంట్స్ వైరల్ కావడంతో నిజంగానే పూరి జగన్నాథ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది..   
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: