' రాక్ష‌సుడు ' ఫ‌స్ట్ షో టాక్‌... బెల్లంకొండ కెరీర్ రివ‌ర్స్‌

VUYYURU SUBHASH
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రైమ్ జానర్ థ్రిల్లర్ చిత్రం “రాక్షసుడు”. తమిళ్ లో “ రాక్ష‌సన్ ” గా తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ షో ల త‌ర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంది. హిట్ కోసం దండ‌యాత్ర చేస్తోన్న బెల్లంకొండ కృషి ఫ‌లించిందో ?  లేదో ?  చూద్దాం.
క‌థేంటి....


బెల్లంకొండ సాయి శ్రీనివాస్(అర్జున్ కుమార్) పోలీస్‌. న‌గ‌రంలో అనూహ్యంగా కొంతమంది అమ్మాయిలు మిస్సవుతు హత్యకు గురవుతుంటారు. హీరోయిన్ అనుపమ(కృష్ణవేణి) టీచర్ గా పని చేసే స్కూల్ లో ఒక అమ్మాయి కూడా కూడా ఇలాగే మిస్సవుతుంది. అసలు ఈ హత్యలు అన్ని ఎవరు చేస్తున్నారు ? ఈ హ‌త్య‌ల వెన‌క ఉన్న కార‌ణం ఏంటి ?  ఈ హ‌త్య‌ల మిస్ట‌రీని హీరో ఎలా ?  చేధించాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.


ఈ సినిమా మొదలయ్యినప్పటి చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ప్రేక్ష‌కుడు కూర్చున్న చోట నుంచి రెప్పార్ప‌కుండా తెర‌పైనే చూస్తుంటాడు. క‌థ‌లో వ‌చ్చే ట్విస్టులు, ఎమోష‌న్‌, స‌స్పెన్స్ మంచి అనుభూతి ఇస్తాయి. క‌థ న‌డుస్తున్న తీరు చూస్తుంటే ఒకానొక ద‌శ‌లో క్రైమ్ థ్రిల్లర్ కాస్తా హార్రర్ థ్రిల్లర్ గా మారిందా ?అన్న అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. బెల్లంకొండ ఈ సినిమాతో న‌ట‌నా ప‌రంగా మ‌రో మెట్టు ఎక్కాడు.


హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం కొత్తగా చెప్పక్కర్లేదు.మరోసారి తన నటనతో ఆకట్టుకుంది.ఇక ఈ కథకు అసలు బలం అయినటువంటి విలన్ పాత్ర చేసిన శరవణన్ కోసం మాట్లాడి తీరాల్సిందే. మొఖం కూడా చూపించ‌కుండా క్రూయ‌ల్ విల‌న్‌గా మెప్పించాడు. ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వ‌ర్మ త‌మిళ సినిమా స‌హ‌జ‌త్వాన్ని చెడ‌గొట్ట‌కుండా సినిమాను తెర‌కెక్కించారు. త‌మిళ్‌లో చూసిన వాళ్ల‌కు అంత థ్రిల్ ఫీల్ ఇవ్వ‌క‌పోయినా సినిమా మాత్రం ఓవ‌రాల్‌గా ఆక‌ట్టుకుంది. కథనంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీసుకెళ్లే విధంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటారు. ఏదేమైనా బెల్లంకొండ‌కు ఈ సినిమా కెరీర్ ప‌రంగా తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇవ్వ‌డంతో పాటు అత‌డి కెరీర్‌ను ట‌ర్న్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: