విజయ్ దేవరకొండకు ఇగో ఎక్కువ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. తాను మనసులో అనుకున్న ఏమాటను అయినా ఎటువంటి మొహమాటం లేకుండా విజయ్ ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి కొత్త హీరోగా పరిచయం అవుతున్న ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు తన అన్న విజయ్ లాగే ఆనంద్ ఇగోను కూడ సూచిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈమూవీలో తనకు అవకాశం విజయ్ దేవరకొండ తమ్ముడు అన్న ఇమేజ్ తో రాలేదని తనను ప్రోత్సహించాలని నిర్మాతలు తనకు అదే విధంగా హీరోయిన్ శివాత్మికకు అవకాసం ఇచ్చారని చెపుతూ తామిద్దరం ఈమూవీ కోసం పడ్డ కష్టాలను వివరించాడు. అయితే తాము కష్టపడిన కారణంగా ప్రేక్షకులు తన సినిమాను చూడరని నిజంగా తన సినిమా నచ్చితేనే ప్రేక్షకులు చూస్తారు అంటూ తన తొలి సినిమాతోనే షాకింగ్ కామెంట్స్ చేసాడు ఆనంద్ దేవరకొండ.
ఇదే సందర్భంలో ఈ యంగ్ హీరో మాట్లాడుతూ నాలుగేళ్ళ క్రితం తాను అమెరికాలో ఉన్నప్పుడు తన అన్న విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’ మూవీ హిట్ అయిందని తెలుసుకుని తాను తన ఆఫీసులో కూర్చుని ఆనందంతో ఏడ్చిన సందర్భం తనకు గుర్తు ఉందనీ అయితే అప్పట్లో చాలామందికి అర్ధంకాక తాను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక ఖంగారు పడిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
తన అన్న విజయ్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలబడటానికి పదేళ్ళు పడ్డ కష్టం తనకు తెలుసు అనీ అయితే అమెరికాలోని ఉద్యోగం వదిలి హైదరాబాద్ తిరిగి వచ్చి గత నాలుగు ఏళ్లుగా గాలిగా తిరుగుతున్న తనకు పిలిచి అవకాసం ఇచ్చిన ‘దొరసాని’ నిర్మాతల ధైర్యం తనను హీరోని చేసింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో ‘దొరసాని’ ఫంక్షన్ లో ఆనంద్ స్పీచ్ విన్నవారు అతడు మాట్లాడిన ప్రతి మాటలోనూ విజయ్ దేవరకొండ ఇగో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..