కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసిన మీసాల కృష్ణుడు..!

shami
సీనియర్ నటు, దర్శక నిర్మత గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న విజయ నిర్మల తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. విజయ నిర్మల మరణం తెలుగు సిని పరిశ్రమకు తీరని లోటు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలది సూపర్ హిట్ పెయిర్.  


సాక్షి సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ గా నిలిచిన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. కృష్ణ, విజయ నిర్మల పెళ్లి మీసల కృష్ణుడు సమక్షంలో జరిగిందట. ఆయనెవరు అనుకునేరు. గోదావరి తీరంలో పులిదిండి గ్రామంలో మీసాల కృష్ణుడు గుడి ఉంది.


అక్కడ కృష్ణుడికి మీసాలు ఉండటం వల్ల ఆయన్ను మీసాల కృష్ణుడు అని అంటారు. బాపు రమణలు డైరెక్ట్ చేసిన సాక్షి సినిమాలో ఆ మీసాల కృష్ణుడి గుడిలో ఓ సాంగ్ లో భాగంగా పెళ్లి బట్టల్లో కృష్ణ విజయ నిర్మల ఉన్నారట. వారి కొంగుకి ముడి వేసి గుడిలోనే షూటింగ్ చేశారట. అయితే గుడి మహత్యం తెలిసిన రాజబాబు కామెడీగా ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్ ఫుల్ ఇక్కడ ఏది అనుకుంటే అది నిజమవుతుందని అన్నాడట.  


ఆయన నోటి మాటో లేక మీసాల కృష్ణుడి మహిమో.. ఆ తర్వాత రెండేళ్లకే కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు. కృష్ణ గారితో విజయ నిర్మల 47 సినిమాల్లో నటించారు. వారిద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: