పవన్ కళ్యాణ్ ను డిఫెన్స్ లో పడేసిన విజయ్ దేవరకొండ నిర్ణయం !

Seetha Sailaja
ఎన్నికలలో పరాజయం తరువాత జూలై మొదటివారంలో అమెరికాలో జరగబోతున్న తానా మహాసభలకు అతిధిగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సభలకు రావడానికి పవన్ ను ఒప్పించడానికి తానా నిర్వాహకులు చాల గట్టి ఒత్తిడి చేసారు. 

దీనితో పవన్ అమెరికా వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై ఏమి మాట్లాడబోతున్నాడు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇలాంటి పరిస్థుతులలో తానా మహాసభల ఆహ్వానాన్ని విజయ్ దేవరకొండ తిరస్కరించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా తానా లాంటి పెద్ద సంస్థల ఆహ్వానాన్ని తిరస్కరించే ధైర్యం యంగ్ హీరోలు చేయరు.

దీనికితోడు విజయ్ దేవరకొండకు ఓవర్సీస్ లో కూడ వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీనితో విజయ్ తానా ఆహ్వానాన్ని తిరస్కరించడం వెనుక కారణాలు ఏమిటి అంటూ ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. తనకు అతి ముఖ్యమైన వ్యక్తిగత పనులు ఉన్న రీత్యా తాను తానా సంస్థ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నాను అంటూ విజయ్ సున్నితంగా ఆ సంస్థ నిర్వాహకులకు చెప్పినట్లు టాక్. 

వాస్తవానికి ఈసారి జరుగుతున్న తానా మహాసభలకు ఆసంస్థ నిర్వాహకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్ద సెలెబ్రెటీలు ఎవరూ స్పందించలేదు అన్న వార్తలు ఉన్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ ను మినహాయిస్తే ఈ సభలకు వస్తున్న అల్లరి నరేష్ నారారోహిత్ సునీల్ లాంటి వాళ్ళకు పెద్దగా క్రేజ్ లేదు. ఇక హీరోయిన్స్ లో ఎవరూ అందుబాటులో లేకపోతే కమిలినీ ముఖర్జీ మాత్రమే ఈ ఈవెంట్ కు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పెద్ద సెలెబ్రెటీలు ఎవరు రాని తానా మహాసభలు తనకెందుకు అనీ విజయ్ దేవరకొండ తప్పించుకున్నాడా లేదంటే పవన్ కళ్యాణ్ అతిధిగా వస్తున్న ఆ ఈవెంట్ లో విజయ్ అతిధిగా వచ్చినా తనకు ప్రత్యేకమైన గుర్తింపు రాదని విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: