సరిలేరు నీకెవ్వరు కథ ఇదేనా

Narayana Molleti

మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా షూటింగ్జరుపుకుంటున్న తెలిసిందే.ఈ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ రోల్ లో నటిస్తున్నాడనిసమాచారం. ఈ సినిమా కథ ఇదేనంటూ ఆన్ లైన్లో ఒక కథ చక్కర్లు కొడుతుంది.


ఈ కథ ప్రకారం ఆర్మీలో ప్రాణ స్నేహితుడైన మహేశ్ స్నేహితుడు యుద్దంలోచనిపోతాడట. ఈవిషయం చెప్పటానికి స్నేహితుడి ఇంటికెళ్ళిన మహేశ్ బాబు కొన్ని కారణాలతో అక్కడే ఉండాల్సివస్తుందట. అక్కడే ఉండి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ పరిష్కరిస్తాడటహీరో.


అనిల్ రావిపూడి ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెరకెక్కించాడని సమాచారం. ఒకవైపుఎమోషన్స్తో సినిమాను నడిపిస్తూనే కామెడీ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడట. మహేశ్ బాబురష్మిక మందన్న మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్గా ఉంటాయని తెలుస్తుంది. అలనాటి హీరోయిన్విజయశాంతి, జగపతి బాబు, బండ్ల గణేష్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా నిర్మాతలుగా అనిల్ సుంకర, దిల్ రాజు, జీ ఎం బిఎంటర్టైన్మెంట్ వ్యవహరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: