నమ్మకం లేని రాజకీయాల పై వివి వినాయక్ వ్యాఖ్యలు !

Seetha Sailaja
నిన్నటి దాకా టాప్ హీరోల సినిమాలకు దర్శకుడుగా పనిచేసి ఎన్నో టాప్ హిట్స్ అందుకున్న వినాయక్ ప్రస్తుతం సినిమా హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. తాను నటించే పాత్ర కోసం అపోలో హాస్పటల్ నుంచి వస్తున్న ప్రోటీన్ ఫుడ్ తింటూ బరువుతగ్గడానికి జిమ్ కు వెళుతూ అనేక ప్రయత్నాలు చేస్తున్న వినాయక్ తన కొత్త కెరియర్ విషయాలను వివరిస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

తన తండ్రి రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అని చెపుతూ ప్రస్తుతం తన తమ్ముడు వైసిపి లో యాక్టీవ్ గా ఉన్న విషయాలను వివరించాడు. తన తల్లి చనిపోయినప్పుడు జగన్ తన ఇంటికి వచ్చి పరామర్శ చేసిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తనను ఈమధ్య జరిగిన ఎన్నికలలో పోటీ చేయమని చాలామంది సలహాలు ఇచ్చినా తాను ఆ సాహసం చేయలేకపోయిన విషయాన్ని వివరించాడు. 

ప్రస్తుతం రాజకీయాలు అంటే ఓట్ల కోసం కోట్ల రూపాయలలో ఖర్చు పెట్టాలని తన తండ్రి రాజకీయాలలో తిరిగి ఆస్థులు పోగొట్టుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ తన తల్లి సలహాతో తనకు అభిలాష ఉన్నప్పటికీ ఈ మనీ పోలిటిక్స్ తట్టుకోలేక దూరంగా ఉన్న విషయాన్ని వివరించాడు. అంతేకాదు తన పిల్లలు సెటిల్ అయిన తరువాత తన రాజకీయ సరదాలు తీర్చుకోమని తన భార్య చెప్పిన సలహాతో తాను మొన్న జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్న విషయాలను వివరించాడు. 

ఇదే సందర్భంలో వినాయక్ తన జీవితంలో వచ్చిన జయాపజయాల గురించి మాట్లాడుతూ మనం ఎంత ప్రయత్నించినా ‘మనది కానిది ఎప్పుడు మన దరి చేరదనీ దానికోసం ఎన్ని పూజలు మొక్కులు మొక్కుకున్నా దేవుడు మనకు ఎంత అర్హత ఉందో అంతే ఇస్తాడు’ అంటూ వేదాంత దోరణిలో కామెంట్ చేసాడు. అందువల్లనే తాను అవకాశాల కోసం సక్సస్ లు కోసం ప్రయత్నాలు చేయనని అంటూ తాను మొదలుపెట్టబోతున్న ఫిలిం యాక్టర్ కెరియర్ రిజల్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఈ మాస్ డైరెక్టర్..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: