పవన్ బండ్ల గణేష్ ప్రాజెక్ట్ లో కీలకం కాబోతున్న 40 కోట్లు !

Seetha Sailaja
‘జనసేన’ పరాజయం తరువాత అంతర్మధనంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను తాను తీయబోయే సినిమా వైపు ఆకర్షింప చేసుకోవడానికి బండ్ల గణేష్ వేసిన ఎత్తుగడ నెమ్మదిగా బయటపడుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బండ్ల గణేష్ పవన్ ను కలిసి తాను తీయబోయే సినిమాలో నటిస్తే ఆసినిమా బిజినెస్ తో సంబంధం లేకుండా 40 కోట్ల భారీ పారితోషికం ఇస్తానని పవన్ కు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాకు బోయపాటి దర్శకత్వం వహించేలా తాను ఏర్పాట్లు చేస్తానని అన్నీ వివరంగా బండ్ల గణేష్ చెప్పినప్పటికీ పవన్ ఎటువంటి స్పందన ఇవ్వకుండా ఒక నవ్వు నవ్వి కొన్నిరోజులు గడిచాక మళ్ళీ కలుద్దాం అంటూ సున్నితంగా బండ్ల గణేష్ తో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై పవన్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ దగ్గర ప్రస్తుతం నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇచ్చిన అడ్వాన్స్ లు ఉండగా పవన్ బండ్ల గణేష్ తో ఎలా సినిమా చేస్తాడు అంటూ పవన్ సన్నిహితులు ఈవార్తల పై తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నట్లు టాక్. 

దీనికితోడు మైత్రీ మూవీస్ చేయవలసిన ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండగా పవన్ బండ్ల గణేష్ తో నడిచే ప్రసక్తిలేదు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ ఆతరువాత ఎన్నికలలో పరాజయం ఇలా వరస పరాజయాలతో సతమతమైపోతున్న పవన్ బండ్ల గణేష్ మాటల మాయలో పడి మరొక ప్రయోగం తన పై తాను చేసుకోడు అని పవన్ సన్నిహితుల అభిప్రాయం అని తెలుస్తోంది. 

ప్రస్తుతం రాజకీయాలకు గుడ్ బై చెప్పి తిరిగి భారీ నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తున్న బండ్ల గణేష్ ప్రస్తుతం నటుడుగా కూడ తన వంతు ప్రయత్నాలను మహేష్ అనీల్ రావిపూడి సినిమాలో చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో రెండు పడవల ప్రయాణం చేస్తున్న గణేష్ మాటలకు ప్రభావితమై నిర్ణయాలు తీసుకునే స్థితిలో పవన్ లేడనీ ఇప్పటికే అనేక చేదు అనుభవాల నేపధ్యంలో పవన్ వాస్తవ దృష్టితో ఉన్నాడు అనీ అతడి సన్నిహితుల అభిప్రాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: