ఈ నెల 24న హాలీవుడ్ సినిమా ది ఎక్స్ పాండ్ బుల్స్-2 తెలుగులో యమదూతలు పేరుతో విడుదల అయ్యింది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాలో వివిధ దేశాలకు చెందిన 11 మంది సూపర్ యాక్షన్ హీరోలు నటించడం కూడా సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది.
కాగా, ఈ సినిమా ప్రభావంతో దక్షిణాది సూపర్ స్టార్లు ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. రజీనీకాంత్, కమల్ హాసన్, ముమ్మట్టి, చిరంజీవి, మెహాన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఉన్న పోస్టర్ ను రూపొందించారు. ఈ పోస్టర్ లో ఉన్నట్లు దక్షిణాది టాప్ హీరోలతో ఓ సినిమా తెరకెక్కితే అభిమానులకు విందు భోజనమే కదా..!
(ఆధారం : దక్కెన్ క్రానికల్)
మరింత సమాచారం తెలుసుకోండి: