సెంటిమెంట్ బ్రేక్ చేసిన పవన్...

K Prakesh

సినిమా ప్రపంచం అంటేనే సెంటిమెంట్లు దీనికి మన టాలీవుడ్ కూడా ఏమి మినహాయింపు కాదు. నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘అత్తారింటికి దారేది’ పవన్ ను ఇప్పటివరకు పీడిస్తున్న ఒక సెంటిమెంట్ బారీ నుండి విముక్తి చేసింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ఏ దర్శకుడికి పవన్ తో తీసిన రెండవ సినిమా కలిసిరాలేదు ‘సుస్వాగతం’ సినిమాతో పవన్ కెరియర్ కు తొలిరోజులలో హిట్ ఇచ్చిన భీమినేని శ్రీనివాసరావు పవన్ తో రెండవసారి తీసిన ‘అన్నవరం’ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే దర్శకుడు కరుణాకరన్ ‘తొలిప్రేమ’ సినిమాతో పవన్ కు మంచి సూపర్ హిట్ ఇచ్చి తరువాత ‘బాలు’ తీసి చేతులు కాల్చుకున్నాడు.

ఇదేకోవలో దర్శకుడు సూర్య ‘ఖుషీ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చి తరువాత ‘కొమరం పులి’ తో భయపెట్టాడు. ఇక పవర్ స్టార్ ను టాప్ హీరోగా మార్చిన ‘బద్రీ’ సినిమాకు దర్శకత్వం వహించిన పూరి క్రితం సంవత్సరం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తీసి నిరాశ పరిచాడు. ఇలా పవన్ తో రెండవ సారి సినిమాలు చేసిన వారందరికీ నిరసామిగిలినా దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఈ గండం నుండి బయటపడి గతంలో తాను దర్శకత్వం వహించిన ‘జల్సా’ కంటే పెద్ద సూపర్ డూపర్ హిట్ గా ‘అత్తారింటిని’ తయారుచేసి రికార్డు సృస్టించాడు.

అయితే ఈ రికార్డు క్రియేట్ చేయడంలో దర్శకుడు త్రివిక్రం ప్రతిభ కన్నా పవర్ స్టార్ ఇమేజ్ ఎక్కువగా పనిచేసింది అంటున్నారు విశ్లేషకులు. ఎదిఎమైనా పవనిజం క్రేజ్ తో నిన్న ఈసినిమా ఆంధ్రప్రదేశ్ లో 10.75 కోట్లు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసినిమా మొదటివారం చివరకు 50 చేసి టాలీవుడ్ రికార్డు క్రియేట్ చేస్తుందని అంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: