త్రిష కొత్త లవర్ వేదాంత్

HANUMA HANUMA
 త్రిష కొత్తగా ప్రేమలో పడింది. ఈ సారి వేదాంత్ తో. వేదాంత్ ముంబయిలో ఉంటాడు. త్రిష లాగానే వేదాంత్ కు కూడా జంతు ప్రేమ ఎక్కువ. తన పుట్టిన రోజుకు ఎవరైనా గిఫ్ట్ లు తెస్తే ఒప్పుకోడు. ఆ మనీని పెటాకు ఇవ్వమని చెప్తాడు.  అంతెందుకు ఈ విషయంలో తన తండ్రికి కూడా కచ్చితమైన వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ త్రిష లవర్ వేదాంత్ వయసెంతో తెలుసా? పదేళ్ళ లోపే. అతని తండ్రి మాధవన్. సఖి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాధవన్ కూడా అచ్చు తనలాగే ప్రవర్తిస్తుండటంతో త్రిషకు వేదాంత్ తెగ ముద్దొచ్చేస్తున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: