గత కొన్నిరోజులుగా మెగా బ్రదర్ నాగబాబు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా బాలకృష్ణను టార్గెట్ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ పై సెటైర్లు వేస్తూ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు చాల ఆసక్తికరంగా ఉన్నాయి.
చిరంజీవి పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత అలవాట్లను బయటపెడుతూ నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. సినిమా సెలెబ్రెటీలు అంతా ఆల్కాహాల్ కు బాగా అలవాటు పడి ఉంటారని అందరూ భావిస్తూ ఉంటారని నాగబాబు అభిప్రాయపడుతూ ఈవిషయంలో చిరంజీవి పవన్ లకు సంబంధించిన వ్యక్తిగత అలవాట్లు బయటపెట్టాడు.
చిరంజీవి ఆల్కహాల్ తీసుకుంటారా అంటూ ఆమీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇస్తూ తన అన్న చాల అరుదుగా ఆల్కాహాల్ తీసుకుంటారని అది కూడ ఎక్కువగా పార్టీలలో మాత్రమే అంటూ కామెంట్స్ చేసాడు. ఇక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే పార్టీలలో కూడ ఆల్కాహాల్ తీసుకోవడానికి ఇష్టపడడు అనీ మరీ మొహమాట పెడితే చాల తక్కువ మొత్తంలో ఆల్కాహాల్ పవన్ తీసుకుంటాడు అన్న విషయాన్ని నాగబాబు బయట పెట్టాడు.
అయితే తన విషయాల గురించి వివరిస్తూ గతంలో తాను ఆల్కాహాల్ బాగా తీసుకునేవాడిననీ అయితే ఆరోగ్య కారణాల రీత్యా తాను ప్రస్తుతం ఆఅలవాటుకు చాల దూరంగా ఉన్న విషయాలను వివరించాడు. అంతేకాదు గతంలో తాను విపరీతంగా సిగరెట్లు కాల్చిన విషయాన్ని వివరిస్తూ ప్రస్తుతం తాను ఆ అలవాటును కూడ మానుకున్నాను అని అంటున్నాడు ఈ మెగా బ్రదర్. సెలెబ్రెటీల వ్యక్తిగత అలవాట్ల గురించి తెలుసుకోవాలనే ఆతృత చాలామందికి సహజంగా ఉంటుంది కాబట్టి నాగబాబు చెప్పిన ఈ విషయాలు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తున్నాయి..