రమాప్రభతో 60 కోట్లు పోగుట్టుకున్న శరత్ బాబు !

Seetha Sailaja
విలక్షణ నటుగా పేరు గాంచిన శరత్ బాబుకు ఇప్పుడు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు లేరు. ఇలాంటి పరిస్థుతులలో శరత్ బాబు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా తాను ఈ ఇంటర్వ్యూను కేవలం రమాప్రభ ఆరోపణల గురించి స్పందించడానికి తాను ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటూ చెప్పడమే కాకుండా అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

తాను రమాప్రభను పెళ్లి చేసుకోలేదని ఆమె తనకంటే 6 సంవత్సరాల వయసు పెద్దది అని చెపుతూ కేవలం తమ ఇద్దరి మధ్య సహజీవన సంబంధం మాత్రమే ఉందని అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు తనకు రామాప్రభాతో పరిచయం ఏర్పడే నాటికే తాను నటుడుగా రాణిస్తున్న విషయాన్ని వివరిస్తూ ఆమె వల్ల తనకు అవకాశాలు వచ్చాయి అని ఆమె చెపుతున్న మాటలు అవాస్తవం అంటూ కామెంట్స్ చేసాడు. 

వాస్తవానికి తమిళనటుడు నంబియార్ కుమార్తెను తాను వివాహం చేసుకున్న విషయాలను వివరిస్తూ ఆతరువాత అభిప్రాయ భేదాలు వల్ల తాను ఆమెకు విడాకులు ఇచ్చిన విషయాన్ని వివరించాడు. రమాప్రభ ఆస్తిని లాక్కుని తాను రోడ్డు మీదకు ఆమెను వదిలేసాడు అన్న వార్తల పై స్పందిస్తూ ఆమెకు ఆళ్వారు పేటలో ఇల్లు కొనుక్కోవడానికి అప్పట్లో తనకు ఉన్న ఒక స్థలాన్ని అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చిన విషయాన్ని బయటపెడుతూ ఆస్థలం ఇప్పుడు తన వద్ద ఉంటే దాని విలువ 60 కోట్లు ఉంటుందని అభిప్రాయపడుతున్నాడు శరత్ బాబు. 

మరెన్నో ఆసక్తికర విషయాలు ఎంతో ఉద్వేగంగా చెప్పుకు వచ్చిన శరత్ బాబు ఎక్కడా రమాప్రభ పేరు ప్రస్తావించకుండా ‘ఆ మహిళ’ అంటూ అన్యాపదేశంగా రమాప్రభ పేరు గుర్తుకు వచ్చేలా కామెంట్స్ చేసాడు. అయితే ప్రస్తుతం అటు శరత్ బాబుకు కానీ రమాప్రభకు కాని అవకాశాలు లేని ప్రస్తుత పరిస్థుతులలో గతానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు శరత్ బాబు గుర్తుకు తెచ్చుకుని ఏమి సాధించ గలుగుతాడు అన్నది సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: