దేవరకొండ విజయ్ దూకుడుకి సాక్ష్యం ఇదే..!

shami
యువ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి మొదలైనట్టే. మూడంటే మూడు సినిమాలతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నోటా ఫ్లాప్ అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన టాక్సీవాలా మరోసారి యువ హీరో సత్తా చాటేలా చేసింది.


రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో దేవరకొండ విజయ్, ప్రియాంకా జవల్కర్ కలిసి నటించిన సినిమా టాక్సీవాలా. హర్రర్ అండ్ కామెడీ మిక్స్ చేసి వచ్చిన ఈ సినిమా మొదటిషో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే కొన్ని చోట్ల లాభాలు తెచ్చి పెట్టింది. ఇక సినిమా మొదటి వారం 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి విజయ్ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది.   


టాక్సీవాలా కలక్షన్స్ విజయ్ దేవరకొండ దూకుడుకి సాక్ష్యమని చెప్పొచ్చు. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ మూవీ అంతకు డబుల్ వసూళు చేసేలా ఉంది. అయితే విజయ్ దేవరకొండ గీతా గోవిందం ఫస్ట్ వీక్ లో 30 కోట్లకు పైగా వసూళు చేసింది. ఆ సినిమాతో పోల్చితే విజయ్ టాక్సీవాలా రేంజ్ తగ్గిందని చెప్పొచ్చు.


ఏది ఎలా ఉన్నా బడ్జెట్, ప్రీ రిలీజ్ విషయంలో జాగ్రత్త పడుతున్న విజయ్ దేవరకొండ మొత్తానికి మరో హిట్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా జవల్కర్ కూడా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: