కష్టాలలో పడ్డ రాజమౌళి !

Seetha Sailaja
రేపటి నుంచి ప్రారంభంకాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా యాక్షన్ సీన్ల షూటింగ్ కోసం  రామ్ చరణ్ ఎన్టీఆర్ లు రిహార్సల్స్ చేస్తూ ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఊహించని సమస్య రాజమౌళిని టార్చర్ పెడుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్స్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఈ టైటిల్స్ కు చెక్ పెట్టె విధంగా ఈమూవీకి సంబంధించిన ఒక మంచి టైటిల్ ఆలోచించి వచ్చే ఏడాది సంక్రాంతి రోజున ప్రకటించాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. 

ఈమూవీ మనదేశంలో అనేక భాషలలో విడుదల కాబోతున్న నేపధ్యంలో అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ‘బాహుబలి’ లాంటి క్యాచీ టైటిల్ కోసం రాజమౌళి అన్వేషణ ప్రారంభించినట్లు టాక్. అన్ని భాషలకు మూల భాష సంస్కృతం కాబట్టి ఈ భాషలో అందరికీ సులువుగా అర్ధం అయ్యే ఒక టైటిల్ గురించి రాజమౌళి అనేక మంది భాష వేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. 

ముఖ్యంగా తెలుగు తమిళ హిందీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న సంస్కృత పదం గురించి రాజమౌళి తీవ్రంగా అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈమూవీకి ఎంతటి భారీ సెట్టింగ్స్ క్యాస్టింగ్ గ్రాఫిక్స్ ఉన్నా మూవీ టైటిల్ ను బట్టి సినిమాలకు సంబంధించిన బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈవిషయంలో ఆచితూచి అడుగులు వేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

సాధారణంగా రాజమౌళి తాను తీసే సినిమాల టైటిల్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగించడు. అందువల్లనే ఈవిషయమై ఇప్పుడు చాల ముందుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి హడావుడిలో బిజీగా ఉంటాడు కాబట్టి ఈలోపునే రాజమౌళి ఈమూవీ టైటిల్ విషయంలో ఒక స్థిర నిర్ణయానికి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: