ఈరోజు విడుదల అవుతున్న ‘టాక్సీవాలా’ కు సంబంధించి ఇప్పటికే ఈ సినిమా పైరసీ ప్రింట్ లీక్ అయి ఇంటర్నెట్లోకి వచ్చినా ఫిలిం మేకర్స్ తమ సినిమాను థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చెయ్యమని పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులను కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రమోషన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల మద్దతు కూడ లభించింది.
పైరసీని ఎంకరేజ్ చేయవద్దని అందరూ థియేటర్లలో మాత్రమే 'టాక్సీవాలా' సినిమా చూడాలని విజయ్ దేవరకొండ చేస్తున్న విజ్ఞపత్తులకు టాప్ హీరో ప్రభాస్ కూడ బాసటగా నిలిచి ఈ సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎవరూ పైరసీని ఎంకరేజ్ చేయవద్దు అంటూ పిలుపు ఇచ్చాడు. అంతేకాదు అందరూ థియేటర్లలో మాత్రమే చూడాలని ప్రభాస్ కోరుతున్నాడు.
దీనికి విజయ్ దేవరకొండ విభిన్నంగా రిప్లయ్ ఇస్తూ ‘అన్నా మాకు ముందు సాహో అప్ డేట్ ఇవ్వండన్నా' అంటూ తన అభిమానాన్ని చాటుకుంటూ రివర్స్ పంచ్ వేసి తన ట్విట్ ద్వారా ప్రభాస్ పై తనకున్న అభిమానంతో పాటు తన ఇగోను కూడ చాటుకున్నాడు. కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడ విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలియచేసాడు అంటే అతడి పై పెరిగిపోయిన ఇమేజ్ అర్ధం అవుతుంది.
ఇది ఇలా ఉండగా ఈరోజు విడుదల అవుతున్న ‘టాక్సీవాలా’ ను ప్రమోట్ చేస్తూ విజయ్ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదు అంటూ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అంతేకాదు తాను నటించే అన్ని సినిమాలు ‘గీత గోవిందం’ లా బ్లాక్ బస్టర్ హిట్ కావనీ ‘టాక్సీవాలా’ చూసి గీతాగోవిందంతో పోల్చవద్దు అంటూ విజయ్ చేస్తున్న కామెంట్స్ బట్టి ఈమూవీ సాధించబోయే ఘనవిజయం పట్ల అతడికి కూడ కొన్ని అనుమానాలు ఉన్నాయా అని అనిపించడం సహజం..