తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!

siri Madhukar
టాలీవుడ్ లో మహానటులు ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో జానపద చిత్రాలకు ప్రాణం పోసిన నటుడు కాంతరావు.  ఎన్నో జానపద సినిమాల్లో నటించి మెప్పించారు కనుకనే ఆయనను కత్తి కాంతారావు అని అంటారు.  తెలుగు సినిమా ప‌రిశ్ర‌మలో ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్ త‌ర్వాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన న‌టుడు కాంతారావు. చక్కని రూపుతో, మేటైన అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు రెండు కళ్లు అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మాత్రం తెలుగు సినిమాకు వారిద్దరు కళ్లు అయితే, కత్తి కాంతారావు తిలకంలాంటివారని చెప్పింది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. కాంతారావు చాలా సినిమాల్లో నటించారు. కానీ ఆయనకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. 

తెలంగాణ ప్రాంతానికి చెందిన సూర్యాపేట జిల్లా గుడిబండలో కాంతారావు జ‌న్మించ‌గా ప్ర‌స్తుతం ఆయ‌న బ‌యోపిక్ రూపొందించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. పీసీ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా, నేడు కాంతారావు 95వ జ‌యంతి సంద‌ర్భంగా మూవీని అఫీషియ‌ల్‌గా లాంచ్ చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 10 నుండి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నారు. 400కి పైగా సినిమాల‌లో న‌టించిన కాంతారావు 100 చిత్రాల‌లో హీరోగా న‌టించారు. కాంతారావు జీవితంకి సంబంధించి పూర్తి రీసెర్చ్ చేసిన ఆదిత్య .. కాంతారావుతో సాన్నిహిత్యం ఉన్న వారు, స్నేహితులు త‌దిత‌ర అంశాల‌ని కూడా సినిమాలో చూపించ‌నున్నార‌ని తెలుస్తుంది.   

అఖిల్ స‌న్నీ.. కాంతారావు పాత్ర పోషించ‌నుండ‌గా, మిగ‌తా పాత్ర‌ల‌కి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. రాకుమారుడు అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా, చంద్ర ఆదిత్య ఫిలిం ఫ్యాక్ట‌రీ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొంద‌నుంది. వచ్చే ఏడాది మార్చి 22న ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా సినిమాను పూర్తిచేసి ప్రేక్షకులకు తీసుకురావాల‌ని టీం భావిస్తుంది. కాంతారావు చ‌నిపోయేముందు రోజుల‌లో ఏం జ‌రిగిందే అంశాల‌ని సినిమాలో హైలైల్ చేయ‌నున్నార‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: