బాలయ్య జూనియర్ లను చివరకు కలిపిన అరవింద సమేత !

frame బాలయ్య జూనియర్ లను చివరకు కలిపిన అరవింద సమేత !

Seetha Sailaja
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంచి గ్రూప్ ఫోటో రెడీ కాబోతోంది. ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ ఇద్దరు అబ్బాయిలను కలిపిన రికార్డు ‘అరవింద సమేత’ కు దక్కబోతోంది. గత కొంతకాలంగా  ఎడమొహం పెడమొహంగా కొనసాగుతున్న బాలకృష్ణ జూనియర్ లమధ్య ప్రేమను తిరిగి కలిగించడంలో హరికృష్ణ మరణం కారణం అయిన విషయం తెలిసిందే.  

వీరిద్దరి మధ్య ఈమధ్య తిరిగి ఏర్పడిన ఈబంధంతో ‘అరవింద సమేత’ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు   బాలయ్య ముఖ్య అతిథిగా వస్తాడని అందరూ అంచనా వేసారు. కాని ఆ అంచనాలు కేవలం గాసిప్పులు గానే మిగిలి పోవడంతో ‘అరవింద సమేత’ విడుదల తరువాత జరుగుతున్న తొలి భారీ సక్సస్ మీట్ కు బాలకృష్ణ అతిధిగా రాబోతున్నట్లు ఈ సంస్థ నిర్మాత్ర్హలు అధికారికంగా ప్రకటించడంతో నందమూరి అభిమానులు మళ్ళీ మరోసారి నేడు దసరా పండుగను జరుపుకుంటున్నారు.    
Actor called up his uncle after returning from Spain and apparently apologised for their differences.

‘అరవింద సమేత’ కు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం వెనుక బాలకృష్ణ అభిమానుల పాత్రతో పాటు తెలుగుదేశం వర్గాలు కూడ తమ శక్తి మేరకు క్రియాశీలకంగా పనిచేసాయి అన్న కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి. గతంలో జూనియర్  ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతోంది అంటే చాలు యాంటీ మెసేజ్ లు యాంటీ ప్రాపగండా లు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

దీనితో ‘అరవింద సమేత’ మూవీలో కొన్ని పొరపాట్లు కనిపించినా వాటిని పట్టించుకోకుండా నందమూరి అభిమానులు అంతా ఒకే విధమైన పాజిటివ్ టాక్ ను ఈమూవీ పై స్ప్రెడ్ చేసారు. మరి కొన్ని రోజులలో తెలంగాణాలో ఎన్నికలు రాబోతూ ఉండటంతో పాటు మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంకు అత్యంత కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో నేడు ‘అరవింద సమేత’ వేదిక సాక్షిగా కనబడబోతున్న జూనియర్ బాలయ్యల ప్రేమానురాగాలు తెలుగుదేశం క్యాడర్ కు ఒక కొత్త జోష్ ను ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికితోడు జనవరిలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ కు జూనియర్ అభిమానుల నుండి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాకుండా చాల వ్యూహాత్మకంగా బాలకృష్ణ నేడు ‘అరవింద’ సక్సస్ మీట్ కు వస్తున్నాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: