అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్. ‘ప్రేమకథ’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ తర్వాత గోదావరి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మనోడికి చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు ఏవీ లేవనే చెప్పొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికే తనకంటూ ఓ హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు సుమంత్.
తాజాగా సుమంత్ నటించిన చిత్రం ‘ఇదం జగత్’చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల మెప్పిస్తున్న సుమంత్ నటించిన ఓ వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతోంది.
విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ట్విస్ట్ ఏంటంటే..తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్ఫ్రైజ్ చెయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.